నందమూరి తారక రామారావు తనయుడుగా సినిమా పరిశ్రమలోకి ప్రవేశించి ఇప్పటివరకు ఎన్నో చిత్రాల ద్వారా ప్రేక్షకులను ఎంతగానో అలరించారు నందమూరి బాలకృష్ణ. ఫ్యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా యాక్షన్ సినిమాలకు పర్మనెంట్ అడ్రస్ గా కుటుంబ కథా సినిమాలను ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ప్రేక్షకులను ఇప్పటివరకు మెప్పించారు. ఇక ఇటీవల ఆయన నటించిన అఖండ సినిమా ప్రేక్షకులను ఎంతటి స్థాయిలో ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. తొలిసారి బాలకృష్ణ ఓ కొత్త రకమైన పాత్రలో నటించగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది

అయితే ఇప్పటి వరకు బాలకృష్ణ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చినా కూడా భారీ ఫ్లాప్ చిత్రాలు కూడా రావడం ఆయన అభిమానులను చాలా నిరాశ పరిచింది. అయితే కొన్ని స్వయంగా హిట్ సినిమాలను వదిలేసుకుని మరి ఫ్లాప్ సినిమాలు చేయడమే వారిని మరింతగా బాధిస్తుంది. ఆ విధంగా ఆయన తన కెరీర్లో వదిలేసుకున్న సూపర్ హిట్ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దర్శకుడు కోదండరామిరెడ్డి తో కలసి ఆయన బజారు రౌడీ అనే సినిమా చేయాలని భావించగా డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ సినిమాను కృష్ణ తనయుడు రమేష్ బాబు తో తీసి సూపర్ హిట్ కొట్టారు.

ఇక చంటి సినిమాను తెలుగులో బాలకృష్ణ తోనే చేయాలని భావించారు కాగా ఆ సినిమాను వెంకటేష్ చేసి సూపర్ హిట్ సాధించాడు. అలాగే వెంకటేష్ హీరోగా నటించిన మరొక సినిమా సూర్యవంశం కూడా బాలకృష్ణ చేయాల్సిందే కానీ చివరి నిమిషంలో ఆ చిత్రం వెంకటేష్ కు వెళ్లి పోయింది. ఇక రాజశేఖర్ కెరీర్లో మంచి సినిమాగా మిగిలిపోయిన సింహరాశి చిత్రం కూడా బాలక్రిష్ణ చేయవలసిన సినిమానే కానీ డైరెక్టర్ వి.సముద్ర చివరి నిమిషంలో రాజశేఖర్ ను హీరోగా ఎంచుకున్నాడు.   సీతయ్య సినిమా ను ముందుగా హరికృష్ణ కాకుండా బాలకృష్ణ అని అనుకున్నాడు దర్శకుడు వైవియస్ చౌదరి. కానీ ఈ సినిమా హరికృష్ణ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమా కూడా బాలకృష్ణ చేయవలసిందే. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా కూడా బాలకృష్ణ చేయవలసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: