తెలుగు సినిమాలలో కథానాయకుడి పాత్ర ఎంత ముఖ్యమో ప్రతినాయకుడి పాత్ర కూడా అంతే ముఖ్యం. వాస్తవానికి ప్రతి నాయకుడు ఎంత బలంగా ఉంటే కథానాయకుడి యొక్క విలువ అంతగా ఎలివేట్ అవుతూ ఉంటుంది. అలా ఇప్పటి వరకు చాలా మంది హీరోలు తమ కంటే ఎక్కువ పాపులారిటీ, విలనిజం బాగా ఉన్న స్టార్ లను ప్రతినాయకులు గా పెట్టుకోవడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తుంటారు. అయితే మొదటి నుంచి ప్రతి నాయకుడు అంటే ప్రేక్షకుల్లో ఒక రకమైన భావం ఉంటుంది.

స్క్రీన్ పై తమ విలనిజాన్ని చూపించి నిజజీవితంలో కూడా ప్రేక్షకుల వద్ద విలన్స్ అయి పోతూ ఉంటారు. కానీ ఈ ప్రతి నాయకులు హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ ఉంటుంది అంటే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. అలా తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం భారీ పారితోషికం తీసుకుంటూ విలనిజానికి కొత్త అర్థం చూపిస్తున్నారు. వారు ఎవరెవరు ఇప్పుడు తెలుసుకుందాం.  లెజెండ్ సినిమాతో విలన్ గా మారి ప్రేక్షకులను ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు జగపతిబాబు. ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తూ ఫుల్ బిజీ గా మారాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకి కోటిన్నర తీసుకుంటూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. 

ఇటీవలే అఖండ సినిమాతో పూర్తి స్థాయి విలన్ గా మారిన శ్రీకాంత్ ఈ సినిమాకు కోటికి పైగానే పారితోషకాన్ని అందుకున్నాడు. మొదట్లో విలన్ గా నటించి ఆ తర్వాత హీరోగా ఎదిగి మళ్లీ ఇప్పుడు విలన్ గా చేస్తుండడం విశేషం. ప్రకాష్ రాజ్ రోజుకు 10 లక్షల పారితోషకాన్ని తీసుకుంటూ ఒక సినిమా మొత్తానికి కోటికి పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. ఇక ఒక సినిమాకి మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట సోను సూద్. మిర్చి సినిమాలో విలన్ గా నటించిన సంపత్ రాజ్ ఆ సినిమా తో స్టార్ విలన్ గా మారిపోయాడు. ఆయన నలభై లక్షలకు పైగా అందుకుంటున్నాడు. సరైనోడు సినిమా లో ప్రతినాయకుడి పాత్ర చేసిన ఆది కోటికి పైగానే తీసుకుంటున్నాడు. భోజ్ పురి నటుడు రవికిషన్ 40 లక్షలు తీసుకుంటున్నడు.

మరింత సమాచారం తెలుసుకోండి: