ప్రతివారం థియేటర్ లలో మరియు ఓటిటి  లలో  సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి, వాటిలో కొన్ని సినిమాలు జనాలకు బెస్ట్ ఆప్షన్ గా మిగులుతాయి. మరి కొన్ని మాత్రం ఆశించిన రీతిలో జనాలను ఆకట్టుకునే లేక పోతాయి. అలా ఈ వారం థియేటర్ లలో మరియు ఓటిటి లలో విడుదల అయ్యి జనాలను బాగా అలరిస్తున్న సినిమాల గురించి మనం తెలుసుకుందాం.

లక్ష్య : నాగ శౌర్య హీరో గా, కేతిక శర్మ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా కు వీరేంద్ర సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహించాడు, ఈ సినిమా డిసెంబర్ 10 వ తేదీ న థియేటర్ లలో విడుదలయ్యింది, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ వారం విడుద లైన సినిమా లలో మంచి సినిమా గా పేరు తెచ్చుకుంది. అలాగే ఈ సినిమా ప్రస్తుతం థియేటర్ లలో విజయవంతంగా కొనసాగుతోంది.

గమనం : శ్రీయ, నిత్యా మీనన్, ప్రియాంక జవాల్కర్ ప్రధాన పాత్ర లలో తెరకెక్కిన ఈ సినిమాకు సుజనా రావు దర్శకత్వం వహించింది, ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా డిసెంబర్ 10 వ తేదీ న థియేటర్ లలో విడుదల అయింది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి స్పందన సంపాదించుకొని థియేటర్ లలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది.

పుష్పక విమానం : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరో గా తెరకెక్కిన సినిమా పుష్పక విమానం, ఈ సినిమా నవంబర్ 12 వ తేదీ న ధియేటర్ లలో విడుదల అయింది, థియేటర్ లలో పర్వాలేదు అనే రేంజ్ లో  ప్రేక్షకుల నుండి ఆదరణను సంపాదిం చుకున్న ఈ సినిమా డిసెంబర్ 10 వ తేదీ నుండి తెలుగు ప్రముఖ ఓటిటి ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది, ఈ సినిమా ఈ వారం ఓటిటి లలో విడుదలైనా మంచి సినిమా ల్లో ఒకటి గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: