ఎప్పుడో మూడున్నరేళ్ల క్రితం త్రివిక్రమ్ తీసిన అరవింద సమేత సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇటీవల రామ్ చరణ్ తో కలిసి చేసిన సినిమా ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తీసిన ఈ భారీ సినిమాలో సముద్రఖని, శ్రీయ, రాహుల్ రామకృష్ణ, అలిసన్ డూడి, అజయ్ దేవగన్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థపై దానయ్య దీనిని భారీగా నిర్మస్తున్నారు.

చరణ్ అల్లూరిగా ఎన్టీఆర్ కొమరం భీం గా చేస్తున్న ఈ మూవీ సాంగ్స్, టీజర్స్, ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్ లో విడుదలై అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాబోయే జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ఎంతో భారీ ఎత్తున రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ పాన్ ఇండియా సినిమాపై నందమూరి, మెగా ఫ్యాన్స్ తో పాటు యావత్ సినిమా లవర్స్ అందరిలో కూడా ఊహకందని రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ మూవీ తరువాత జనతా గ్యారేజ్ దర్శకుడు కొరటాల శివ తో తన నెక్స్ట్ మూవీ చేయనున్నారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఆర్ట్స్ తో పాటు మరొక సంస్థ యువ సుధా ఆర్ట్స్ వారు కలిసి ఎంతో భారీ ఎత్తున దీనిని పాన్ ఇండియా సినిమాగా నిర్మించనున్నారు. ఇటీవల ఎన్టీఆర్ కి ఒక అద్భుతమైన స్టోరీ వినిపించి ఓకె ఆమోదం అందుకున్న కొరటాల ప్రస్తుతం దాని స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అలానే దీని అనంతరం ప్రశాంత్ నీల్, తమిళ దర్శకడు అట్లీ వంటి దర్శకులతో కూడా ఎన్టీఆర్ పని చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తరువాత వరుసగా మూవీస్ ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: