ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే సినిమాకి బిజినెస్ పెరుగుతుంది. డబుల్ స్టార్డమ్‌తో ఓపెనింగ్స్‌ కూడా పెరుగుతాయి. కానీ ఇమేజ్‌ లెక్కలతో మల్టీస్టారర్స్‌ చేసేందుకు వెనకాడుతున్నారు స్టార్ హీరోలు. దీంతో ఫ్యామిలీ స్టారర్స్‌ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. టాలీవుడ్‌ బడా ఫ్యామిలీస్‌ నుంచి ఫ్యామిలీస్టారర్‌ మూవీస్‌ తీసుకొస్తున్నారు.

చిరంజీవి, రామ్‌ చరణ్‌ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే మెగాఫ్యాన్స్‌కి సూపర్ ఎనర్జీ వస్తుంది. 'మగధీర, బ్రూస్‌ లీ' సినిమాల్లో చిరంజీవి స్పెషల్‌ రోల్‌లో కనిపించినప్పుడు థియేటర్లు హంగామా చేశాయి. ఇక ఈ జోష్‌ని మరింత పెంచడానికి చిరంజీవి, రామ్ చరణ్‌ 'ఆచార్య' సినిమా చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో చరణ్‌ కీ-రోల్ ప్లే చేశాడు.నాగార్జున అవకాశం దొరికినప్పుడల్లా వారసులతో కలిసి సినిమాలు చేస్తుంటాడు. కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున, నాగచైతన్య ఇద్దరూ కలిసి 'బంగార్రాజు' చేస్తున్నారు. 'సోగ్గాడే చిన్ని నాయనా' ప్రీక్వెల్‌గా తెరకెక్కుతోందీ సినిమా. అలాగే నాగార్జున 'ఘోస్ట్' సినిమాలో అఖిల్ క్యామియో రోల్‌ ప్లే చేస్తాడనే టాక్ వస్తోంది.

బాలక్రిష్ణ కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ ఎలాంటి సినిమాతో బరిలో దిగుతాడా అని ఊహల్లో ఉన్న ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్ చెప్పాడు బాలయ్య. 'ఆదిత్య 369' సీక్వెల్ 'ఆదిత్య 999'తో మోక్షజ్ఞని లాంచ్‌ చేస్తానని చెప్పాడు. ఇక ఈ మూవీలో బాలయ్య, మోక్షజ్ఞ ఇద్దరూ హీరోలుగా చేయబోతున్నారు. హీరో, సపోర్టింగ్‌ రోల్స్‌ అనే తేడా లేకుండా తెలుగు నుంచి హిందీ వరకు రకరకాల క్యారెక్టర్స్‌ ప్లే చేస్తున్నాడు రానా. డిఫరెంట్‌ జానర్స్‌తో జర్నీ చేస్తోన్న రానా, రీసెంట్‌గానే చిన్నాన్న వెంకటేశ్‌తో కలిసి 'రానా నాయుడు' అనే వెబ్‌ సీరీస్‌కి సైన్ చేశాడు. అలాగే ఈ బాబాయ్-అబ్బాయ్‌ ఇద్దరూ కలిసి మళయాళీ హిట్ 'డ్రైవింగ్‌ లైసెన్స్' రీమేక్‌లో నటిస్తారనే ప్రచారం జరుగుతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: