తెలుగులోనే అది పెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ సీజన్ 5 మరో వారం రోజుల్లో ముగియనుంది. దీంతో అభిమానులు టైటిల్ విన్నర్ ఎవరు అవుతారా అని ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే..బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ సన్నీ నే అని ఫిక్స్ అయిపోవచ్చు. కానీ షణ్ముఖ్ కి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. దీంతో షన్నూ అభిమానులు కూడా భారీ స్దాయిలో ఓట్లు వేస్తున్నారు.

కాగా బిగ్ బాస్ సీజన్ 5 లో చివరి వారం ఎలిమినేషన్ లో భాగంగా కాజల్ ఎలిమినేట్ అయ్యింది. టాప్ 5 లో ఉండాలని ఎంతో ఆశపడిన కాజల్ ఓట్లు తక్కువ రావడంతో బిగ్ బాస్ హౌస్ ని వదిలిరావాల్సి వచ్చింది. కాగా, బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అన్నీ రోజులు కాజల్ ఎవరితో ఒకరితో గొడవలు వేసుకుంటూనే ఉన్నింది. అది తెలిసికావచ్చు. తెలియక కావచ్చు కాజల్ ప్రతి ఒక్క గొడవలో ఇన్ వాల్వ్ అయ్యింది.

అయితే, మొదటి నుండి షణ్ముఖ్ తో కలిసి ఉన్న కాజల్ సడెన్  గా ఆయన్ను దూరం పెడుతూ వచ్చింది. చివరి వారం వరకు షన్ను తో గొడవ పడుతూనే వచ్చింది. దీంతో కాజల్, షన్నూను దూరం పెట్టడానికి కారణం ఏంటా అని చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో నెటిజన్స్ షణ్ముఖ్ సిరితో క్లోజ్ గా ఉండడం వల్ల ఆయన పేరు బయట ఎలా ఉండబోతుందో అంచనా వేసిన కాజల్..ముందుగానే షన్ను కి దూరంగా ఉండడం స్టార్ట్ చేసింది అంటున్నారు. అందుకే సన్నీ,మానస్ ల తో ఫ్రెండ్ షిప్ చేసి..తన జర్నీ ని కొనసాగించింది అంటున్నారు నెటిజన్స్. ఇక కాజల్ కూడా తన ఫ్రెండ్ సన్నీనే విన్నర్ కావాలి అని కోరుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: