జనరల్ గా మనం ఐటెం సాంగ్ వింటున్నా..లేక చూస్తున్న వెంటనే ఇంట్లో ని పెద్దవాళ్లు వచ్చి ఛానెల్ మార్చేస్తారు. లేదా అరుస్తారు. ఇలాంటివి చూడకూడదు తప్పు అంటూ సర్దిచెప్పుతారు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఐటెం సాంగ్ అంటే ఓ పెద్ద బూతు. ఎక్స్ పోజింగ్ లు చేస్తూ తప్పుడు పదాలను పాటలో వాడుతారు అనే భావన వాళ్లల్లో ఉంటుంది.

కానీ ప్రజెంట్ పరిస్ధితులు చూస్తే భిన్నంగా ఉన్నాయి. అది ఐటెం సాంగ్ కాదు నార్మల్ పాట కాదు అన్నీంటిలోను ఎక్స్ పోజింగ్ కామన్ గా కనిపిస్తుంది. కాగా రీసెంట్ గా రిలీజ్ అయిన ఒక్క పాట మాత్రం చిన్న పెద్ద తేడా లేకుండా అందరు ఎంజాయ్ చేస్తున్నారు. ఆ పాటే "ఊ అంటావా మావ..ఊ ఊ అంటావా మావా"..!!

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్- బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమార్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప చిత్రంలోని ఈ ఐటెం సాంగ్..సోషల్ మీడియాలో దూసుకుపోతూ టాప్ ట్రెండింగ్ లో ఉంది. ముఖ్యంగా ఈ పాటకు ప్లస్ పాయింట్ సింగర్ ఇంద్రావతి గొంతు. మత్తెక్కించే వాయిస్ తో మావా అంటూ పాడుతుంటే కుర్రకారు మతులుపోతున్నాయి. ఇక ఆ పాటకు సమంత హాట్ స్టెప్పులు కలిస్తే..రచ్చ రచ్చేగా.


ఇక ఈ పాటకు సెలబ్రిటీలు, సామాన్యులు కూడా చిందులు  వేస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ అరియానా కూడా చిందులు వేసి అబిమానులను అలరించింది. హాట్ ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టేసింది . ఇక దీని పై నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ అరియానా ఫ్యూచర్ లో సమంతకు కాంపీటీషన్ వస్తుందేమో అని  అంటున్నారు.

ఇక ఈ పాట పై కొందరు మగవాళ్లు అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాటలోని లిరిక్స్ మగవాళ్లను కించపరిచే విధంగా ఉన్నాయి అంటూ మండిపడుతున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: