2021తెలంగాణా లో టాలీవుడ్‌లో కలెక్షన్ ల పరంగా చూస్తే మంచి హిట్ అందుకున్న సినిమాలు క్రాక్‌, లవ్‌స్టోరీ, మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌,వకీల్‌ సాబ్‌, అఖండ, ఉప్పెన అని చెప్పొచ్చు.ఇక ఆంధ్ర విషయానికి వస్తే అలాంటి సినిమాలు ఒక్కటీ లేవు.దానికి కారణం ఏంటో మనందరికీ తెలిసిందే.అయితే బాలయ్య నటించిన అఖండ సినిమాకి కూడా ఇప్పుడు అదే ఇబ్బంది వచ్చి పడింది.దానికి కారణం అంధ్రప్రదేశ్ లో టిక్కెట్ ధరలు ఆకాశాన్ని తాకడమే.నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తాజాగా తెరకెక్కిన తాజా చిత్రం అఖండ. ద్వారక క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా..

డిసెంబర్ 2వ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.ఈ సినిమాలో బాలకృష్ణ జోడీగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా శ్రీకాంత్, పూర్ణ, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై  దుమ్మురేపే వసూళ్లతో కొనసాగుతుంది.ఇక్కడ ఈ సినిమా వసూళ్లు ఇలా ఉండగా ఆంధ్రా లో మాత్రం వసూళ్లు అంతంత మాత్రమే అని తెలుస్తోంది.దానికి కారణం సినిమా బాగాలేదని కాదు....దానికి కారణం ఏ పి ప్రభుత్వం టిక్కెట్ ల ధరల విషయం లో వ్యవహరిస్తున్న తీరు.

సినిమా వసూళ్లు బాగా వస్తాయి అనుకున్న నిర్మాతల ఆశ కాస్త నిరసాయింది.అయితే ఇప్పటికే అఖండ సినిమా రూ.100 కోట్లకు పైగా గ్రాస్, రూ.60 కోట్లకు పైగా షేర్ లను సంపాదించింది.ఏ పి లో కూడా సినిమా మంచిగా ఆడితే ఇంకా ఈ నెంబర్ పెద్దది అయ్యేది అని అంటున్నారు నిర్మాత.అయితే తాజా సమాచారం ప్రకారం  26 కోట్లకు అమ్మితే ఇప్పటిదాకా 21.5 కోట్ల షేరే వచ్చినట్టుగా తెలుస్తుంది.ఈ సినిమాను దిల్ రాజు 10.5 కోట్లకు కొన్నారు....ప్రస్తుతం ఆయన 7 కోట్ల రూపాయల లాభంతో ఉన్నారు.మొత్తానికి ఆంధ్ర టిక్కెట్ ల వ్యవహారం అఖండ సినిమాపై భారీగానే పడిందని చెప్పాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: