కోలీవుడ్ స్టార్ హీరోలు కేవలం తమ మాతృభాష తమిళంలోనే కాకుండా అన్ని భాషలలో కూడా డబ్బింగ్ చేసి మంచి కలెక్షన్లను రాబడుతోంది దూసుకుపోతున్నారు. అంతే కాదు అక్కడ హీరోలు అందుకునే రెమ్యూనరేషన్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు.

రజనీకాంత్:సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రజనీకాంత్ మొదటి నుంచి తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక ఈయన ఏదైనా సినిమాలో నటిస్తున్నారు అంటే ఒక్కొక్క  సినిమాకు రూ.50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.

కమల్ హాసన్:

విశ్వ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కమలహాసన్ ఒక్క సినిమాకు 25 కోట్ల రూపాయల నుంచి 30 కోట్ల రూపాయల వరకు పారితోషికం అందుకుంటున్నారట. ఈయనకు కూడా తమిళ్ తో పాటు ఇతర భాషలలో కూడా మంచి క్రేజ్ ఉందని చెప్పవచ్చు.

అజిత్:అజిత్ కు వున్న  స్టార్ స్టేటస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఒక్కో సినిమాకు 42 కోట్ల నుంచి 50 కోట్ల వరకు పారితోషకం గా తీసుకుంటున్నారని సమాచారం.

సూర్య:తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న సూర్య ఒక్కో సినిమాకు 22 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం.

ధనుష్:హీరో మాత్రమే కాదు సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు కూడా. ఒక్కో సినిమాకు 15 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్  తీసుకుంటున్నారు.

విజయ్:విజయ్ వీరందరి కంటే కాస్త భిన్నంగా అని చెప్పవచ్చు. ఆయన ఇప్పటివరకు తమిళ సినిమాలలో ఒక్కో సినిమాకి రూ.50 కోట్లు పారితోషికం తీసుకున్న విషయం తెలిసిందే.. అయితే తాజాగా ఆయన వంద కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.. అంతేకాదు తెలుగులో తీయబోయే ఒక సినిమాకు నిర్మాత దిల్ రాజు 100 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ కింద అడ్వాన్స్ కూడా  ఇచ్చారు.

కార్తీక్:ఆయన హీరోగా సూర్య తమ్ముడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక్కో  సినిమాకు పది కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

ఇక వీరితో పాటు విజయ్ సేతుపతి రూ.12 కోట్లు, శివకార్తికేయన్ రూ. 12 కోట్లు, విక్రమ్ రూ. 20 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: