టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మళ్లీ చాలా కాలం తర్వాత నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద రికార్డులు నెలకొల్పు తున్నాడు. గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న బాలయ్య అఖండ సినిమాతో బాక్సాఫీసు వద్ద గర్జించాడు. సింహా, లెజెండ్ వంటి భారీ విజయం తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరోసారి నటించి సంచలన విజయాన్ని అందుకున్నాడు బాలకృష్ణ. డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అఖండ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. కేవలం తెలుగుగడ్డ పై నే కాదు అమెరికాలో కూడా ఈ సినిమా భారీ కలెక్షన్స్ ని అందుకని క్లాస్ ఆడియన్స్ చేత విజిల్స్ వేయించింది.

ఇక విడుదలైన తర్వాత ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కేవలం వారం రోజుల్లోనే భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఇక తాజాగా యుఎస్ లో అఖండ సినిమా వన్ మిలియన్ డాలర్స్ ని అందుకొని సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా వన్ మిలియన్ డాలర్లను అందుకుంటుందా అనే అనుమానాలు చాలానే వచ్చాయి. అలాంటి తరుణంలో ని ఈ సినిమా వన్ మిలియన్ మార్క్ అందుకుంది. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో కూడా యు ఎస్ లో ఈ సినిమా వన్ మిలియన్ డాలర్లను అందుకుందంటే విశేషమనే చెప్పాలి.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో చేసుకుంటే దాదాపు అన్ని చోట్లా ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు రావడం జరిగింది.ఇంకా ఆంధ్రప్రదేశ్లో మాత్రం కొంత లాభం రావాల్సి ఉంది. ఏదేమైనా కానీ నందమూరి బాలకృష్ణ ఒక మాస్ కథతో బాక్సాఫీస్ వద్ద ఎంట్రీ ఇస్తే తప్పకుండా సరికొత్త రికార్డులను క్రియేట్ చేయగలడు అని మరోసారి బోయపాటి శ్రీను నిరూపించాడు. ఇక ముందు ముందు కూడా వీరి కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ముందు అఖండ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు బోయపాటి శ్రీను. దాని తర్వాత టాలీవుడ్ లో ఉన్న కొంతమంది స్టార్ హీరోలతో బోయపాటి సినిమాలు చేయనున్నట్లు సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: