'బిగ్ బాస్ 5 ' కంటెంస్టెంట్ మానస్ నాగులపల్లి హీరోగా నటించిన 'క్షీర సాగర మథనం' సినిమాకి తెలుగులో అసాధారణ విజయం లభించిన సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాకి ఇప్పటికీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.ఈ సినిమా కథానాయకుడు మానస్ నాగులపల్లి బిగ్ బాస్ కి సెలెక్ట్ కావడం, అందులో చాలా బాగా ఆడుతూ 'టాప్-5″కి చేరడం 'క్షీరసాగర మథనం' సినిమాకి బాగా కలిసొచ్చింది. ప్రముఖ సీనియర్ సహా నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్,… అక్షత సోనావని, చరిష్మా శ్రీకర్ ఇంకా ప్రదీప్ రుద్ర ఇతర ముఖ్య తారాగణంగా… యువ ప్రతిభాశాలి అనిల్ పంగులూరి డైరెక్షన్ లో రూపొందిన 'క్షీరసాగర మథనం' సినిమాని శ్రీ వెంకటేశ్వర పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ నిర్మించడం జరిగింది.

తమ సినిమాని అమెజాన్ ప్రైమ్ ఆడియన్స్ ఇప్పటికీ విశేషంగా ఆదరిస్తున్నారని ఇక త్వరలోనే ఈ సినిమాని హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో డబ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, తమ హీరో మానస్ నాగులపల్లి బిగ్ బాస్ 5 కి సెలెక్ట్ కావడమే కాకుండా అందులో చాలా బాగా ఆడుతూ లక్షలాదిమంది అభిమానం చూరగొంటుండడం 'క్షీరసాగర మథనం' సినిమా ఇంత ఘన విజయం సాధించడానికి ఒక ముఖ్య కారణమయ్యిందని దర్శకుడు అనిల్ పంగులూరి తెలిపడం జరిగింది. మానస్ నాగులపల్లి బిగ్ బాస్ 5 టైటిల్ గెలిచి విజేతగా నిలవాలని మనసారా కోరుకుంటున్నామని, అందుకు మానస్ అన్నివిధాలుగా తగిన అర్హుడని అనిల్ పంగులూరి అన్నాడు. మరి చూడాలి బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక మానస్ నాగులపల్లి క్రేజ్ ఎలా ఉంటుందో.ఇక బిగ్ బాస్ కి రాకముందు మానస్ పలు సీరియల్లలో నటించి మంచి కుటుంబ కథ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి బిగ్ బాస్ తో క్రేజ్ పెరుగుతుందో లేదో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: