తెలుగు సినిమా లకు కథ ఎలా ఉన్నా మంచి మ్యూజిక్ ఉంటే ఆ సినిమా భారీగా వసూళ్ల ను రాబట్టడంతో పాటుగా రికార్డ్‌ను బ్రేక్ చేస్తుంది. లెక్కకు మించిన సినిమాలు జనాల ముందుకు వస్తున్నాయి. సాంగ్స్, డ్యాన్స్ బాగున్నా సినిమాలే మంచి టాక్ ను అందుకున్నాయి. కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ విడుదల అయిన సినిమాలలో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య అఖండ సినిమా ఎంత ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిన విషయమే.

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా ఇది. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందించాడు. ఈయన మ్యూజిక్ లో వచ్చిన ప్రతి సినిమా బొమ్మ బ్లాక్ బాస్టరే. ఇతని మ్యూజిక్ కు తెలుగు డ్తెరెక్టర్స్ ఫిదా అయ్యారు. మరో రికార్డ్ ను తన ఖాతాలో మరో హిట్ ను వేసుకున్నాడు.ఇది ఇలా ఉండగా తాజాగా రాదే శ్యామ్ సినిమా కు థమన్ తో రీరికార్డింగ్ చేయించేందుకు యూవీ సంస్థ ప్లాన్ చేస్తున్నట్లుగా చిత్ర పరిశ్రమ లో వార్తలు వినిపిస్తున్నాయి.

రాధేశ్యామ్ పాటలకు ఒక్కో భాషను బట్టి ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్‏ను ఫిక్స్ చేసింది చిత్రయూనిట్..తెలుగు వర్సెన్ లో థమన్ తో రీరికార్డింగ్ బెస్ట్ అని భావిస్తుంది.ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రాధేశ్యామ్ మ్యూజిక్ స్పెషల్ గా ఉండటం కోసం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వర్షన్లకు జస్టిన్ ప్రభాకరన్ అందిస్తున్నాడు. హిందీ వెర్షన్‏కు మిథున్, అర్మాన్ మాలిక్, అర్జీత్ సింగ్, మనన్ భరద్వాజ్ మ్యూజిక్ డైరెక్టర్‏ లు పని చేస్తున్నారు. ఈ సినిమా రికార్దులు బ్రేక్ చెయ్యాలి అంటే థమన్ రంగం లోకి దిగాలని భావిస్తున్నారట.షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ప్రభాస్ నుంచి వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలె ఉన్నాయి.. ఎలా అలరిస్తుందొ చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: