బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్ వీక్ లో విన్నర్ డిసైడింగ్ ఓటింగ్స్ జరుగుతుంది. ఆడియెన్స్ ఇప్పటికే తమకు నచ్చిన కంటెస్టంట్ ని గెలిపించాలని ప్రయత్నిస్తున్నారు. టైటిల్ రేసులో సన్నీ, షణ్ముఖ్ పేర్లు మాత్రమే వినిపిస్తుండగా లేటెస్ట్ ఓటింగ్ ప్రకారం సింగర్ శ్రీరాం చంద్ర ఓటింగ్ కూడా బాగానే పెరిగినట్టు తెలుస్తుంది. ఇండియన్ ఐడల్ విన్నర్ గా శ్రీరాం చంద్రకు సూపర్ ఫాలోయింగ్ ఉంది. అదే పాపులారిటీతో అతనికి ఓట్స్ వేస్తున్నారని తెలుస్తుంది.

సన్నీనే టైటిల్ విన్నర్ అని అందరు అనుకుంటున్నా శ్రీరాం చంద్ర నుండి కూడా ఖచ్చితంగా గట్టి పోటీ వచ్చేలా ఉంది. అంతేకాదు శ్రీరాం చంద్ర టైటిల్ విన్నర్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అన్ అఫీషియల్ పోల్స్ లో కన్నా అఫీషియల్ పోల్స్ లో శ్రీరాం చంద్రకు ఎక్కువ ఓట్స్ పడుతున్నాయని తెలుస్తుంది. సోమ, మంగళ వారాల్లో హౌజ్ మెట్స్ ల జర్నీ చూపించి ఆడియెన్స్ ను అలరించాడు బిగ్ బాస్.

ఇక టైటిల్ విన్నర్ ఎవరన్నది ఈ సండే తెలుస్తుంది. ఆదివారం షో ఆరు గంటలకే మొదలవుతుందని టాక్. సన్నీ, షణ్ముఖ్, శ్రీరాం ఈ ముగ్గురిలోనే ఒకరు విన్నర్ ఉంటారని తెలుస్తుంది. అయితే సన్నీ విన్నర్ అయితే శ్రీరాం చంద్రనే సెకండ్ పొజిషన్ ఉంటాడని. షణ్ముఖ్ థర్డ్ ప్లేస్ లో ఉంటాడని చెప్పుకుంటున్నారు. మరి బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 టైటిల్ విన్నర్ ఎవరన్నది మరో నాలుగు రోజుల్లో తెలుస్తుంది. ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ కు గెస్టులను కూడా బాలీవుడ్ నుండి దించుతున్నారని తెలుస్తుంది. తప్పకుండా ఫైనల్ ఎపిసోడ్ బిగ్ బాస్ సీజన్ మొత్తం లో రానటువంటి హయ్యెస్ట్ టి.ఆర్.పి తెచ్చే అవకాశం ఉందని ఫిక్స్ అవ్వొచ్చు. నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 5 కూడా సూపర్ సక్సెస్ అయ్యింది. వచ్చే సీజన్ కూడా నాగ్ హోస్ట్ గా కొనసాగుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: