ఉప్పెన సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ అయిపోయింది కృతి శెట్టి. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఉప్పెన సినిమాలో  బాగా నటించడమే కాకుండా రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా అదరగొట్టింది. తన స్మైల్, తన యాక్టింగ్, తన చూపులతో కుర్రకారులను కట్టిపడేసింది. ఉప్పెన సినిమాలో నటించినప్పుడు కృతి శెట్టికి 16 సం. మాత్రమే. ఆ ఏజ్ లోనే యాక్టింగ్ ఇరగదీసింది. అప్పుడే రొమాంటిక్ సన్నివేశాల్లో మైమరపించింది. ఆ సినిమా తర్వాత కృతికి చాలానే ఛాన్స్ లు వచ్చాయి. ఇప్పుడు కృతి శెట్టి చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. నాని సరసన శ్యామ్ సింగరాయ్, నాగచైతన్యతో బంగార్రాజు, సుధీర్ బాబు సరసన ఆ అమ్మాయి గురించి చెప్పాలి సినిమాలు ఇప్పటికే  అనౌన్స్ చేసింది. ఇవి కాకుండా మరో సినిమాకి కూడా సైన్ చేసినట్టు సమాచారం. ఇంకా ఆఫర్స్ కూడా వస్తున్నాయి.

 అందరూ కూడా కృతి శెట్టి గురించే మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం శ్యాం సింగరాయ్ సినిమా. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదలకానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. అంతకుముందు సినిమా నుంచి సాంగ్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ సాంగ్స్ ట్రైలర్ లో నాని కి లిప్ లాక్ ఇవ్వడమే కాకుండా రెచ్చిపోయి రొమాంటిక్ సీన్స్ లో నటించింది కృతి. ఈ సినిమాలో కృతి పూర్తిగా మోడ్రన్ క్యారెక్టర్ చేసింది. 20 ఏళ్లు కూడా లేకుండానే కృతి శెట్టి ఈ రేంజిలో పర్ఫామెన్స్ చేసిందంటే మున్ముందు భవిష్యత్తులో ఎలాంటి క్యారెక్టర్ చేస్తుందోనని అంచనా వేస్తున్నారు.

ఇక మొదటి సినిమాతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువగా ఈ సినిమాకి, తర్వాత వచ్చే సినిమాలకు తీసుకున్నట్లు సమాచారం. దింతో ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ అందరు కృతిని చూసి నేర్చుకోవాలంటున్నారు. మొదటి సినిమా తర్వాత కృతి ఇమేజ్ పూర్తిగా మారిపోవడం ఖాయమంటున్నారు ప్రేక్షకులు. ఎలాగైతేనేమి మరోసారి తన రొమాంటిక్ సీన్స్ తో వార్తల్లో, సోషల్ మీడియా లో హైలెట్ గా నిలుస్తోంది బేబమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: