బాలీవుడ్ లో ప్రేమపక్షులు వరుసగా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇటీవలే బాలీవుడ్ కపుల్  విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ను పెళ్లి చేసుకొని ఒక్కటైన అయిన విషయం తెలిసిందే. బాలీవుడ్ అభిమానులతోపాటు ఇతర ఇండస్ట్రీలో కూడా కొందరు అభిమానులు బాలీవుడ్ లో స్టార్ జంట ఎప్పుడెప్పుడు ఒకటి అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. కానీ ఆ స్టార్ జంట మాత్రం పెళ్లి మాట వచ్చేసరికి అదిగో, ఇదిగో అంటూ మాటలు దాటేస్తున్నారు. ఆ స్టార్ జంట ఎవరో కాదు..రణ్ బీర్ కపూర్, అలియా భట్. ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ గత ఏడాది నుంచి వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

కానీ ఈ జంట మాత్రం తన పెళ్లి విషయంలో ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. గతేడాది డిసెంబర్ లో ఈ జంట ఒక్కటి కాబోతున్నారు అంటూ వార్తలు వినిపించినప్పటికీ అవి రూమర్స్ గానే మిగిలిపోయాయి. ఆ సమయంలో ఈ జంట బ్రహ్మాస్త్ర సినిమా షూటింగ్ తర్వాత పెళ్లి చేసుకుంటామని తెలిపారు. వారు చెప్పిన విధంగా  సినిమా షూటింగ్ కూడా పూర్తి అయ్యింది కానీ ఆ జంట మాత్రం ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అనే విషయంపై స్పష్టత ఇవ్వడంలేదు. వీరిద్దరి పెళ్లి ఎప్పుడు అనేది సస్పెన్షన్ లో పడింది.

 ఇదిలా ఉంటే తాజాగా బ్రహ్మాస్త్ర సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ ఈవెంట్ లో ఈ జంట ఫ్యాన్స్ ఇంటారాక్ట్ అయ్యింది. ఈ క్రమంలోనే పలువురు అభిమానులు ఆలియా, రన్బీర్ కపూర్ లను అడగాలనుకున్న ప్రశ్నలను ఒక పేపర్ లో రాసి ఇచ్చారు. ఈ క్రమంలోనే ఒక అభిమాని నుంచి మీ పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురయింది. ఈ విషయంపై స్పందించిన రన్ బీర్ గత ఏడాది నుంచి పలువురు సెలబ్రిటీలు పెళ్లి చేసుకొని వారి వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతున్నారు. అలా నేను కూడా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని ఉంది. సరే మన పెళ్లి ఎప్పుడూ అంటూ ఆలియా వైపు చూశాడు. అప్పుడు ఆలియా నన్ను అడుగుతావేంటి అని సమాధానం ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇక ఈ జంట తీరు చూసిన నెటిజెన్స్ ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా లేరు అంటూ తనదైన శైలిలో స్పందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: