బిగ్ బాస్ సీజన్ 5 లో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్, సిరిల హంగామా తెలిసిదే. టాప్ 5లో ఉన్న ఈ ఇద్దరి జర్నీ జోరుగా కొనసాగింది. ముఖ్యంగా వీరిద్దరి ఫ్రెండ్ షిప్ హద్ధులు దాటేసిందని చెప్పొచ్చు. హౌజ్ లో 19 మంది ఉన్నా సరే షణ్ముఖ్ పక్కనే సిరి, సిరి పక్కనే షణ్ముఖ్ అనేలా ఆట కొనసాగించారు. ష్యూర్ షాట్ విన్నర్ అవ్వాల్సిన షణ్ముఖ్ ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో ఉండటానికి కారణం కేవలం సిరినే అని అంటున్నారు.

ఆల్రెడీ షణ్ముఖ్ బయట దీప్తి సునైనాతో.. సిరి, శ్రీహాన్ తో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుని ఉంది. కాని హౌజ్ లో వీళ్లిద్దరు వాళ్లిద్దరిని మర్చిపోయి ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యారు. శుక్రవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ సిరిని ఫేక్ ఎలిమినేషన్ చేయగా షణ్ముఖ్ బోరున ఏడ్చాడు. వెళ్తూ వెళ్తూ సిరి ఐలవ్యూ షణ్ను అనేసింది. ఆమె వెళ్లాక షణ్ముఖ్ కూడా మానస్ దగ్గర తనకు సిరి అంటే ఇష్టమే కాని ఆమెకు చెప్పలేదు అన్నట్టు మాట్లాడాడు. అయితే ఆమెను కొద్దిసేపు కన్ ఫెషన్ రూం లో ఉంచి మళ్లీ తిరిగి హౌజ్ లోకి పంపించారు.

అప్పుడు షణ్ముఖ్ ఫేస్ లో 1000 వాట్స్ బల్బ్ లా వెలిగిపోయింది. కొద్దిపాటి ఎడబాటునే భరించలేనంతగా వాళ్లిద్దరు ఓ రేంజ్ లో హగ్ చేసుకున్నారు. షణ్ముఖ్, సిరిల మధ్య బలమైన ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది అని చెప్పడంలో ఈ ఒక్క ఎపిసోడ్ చాలు. అయితే ఆల్రెడీ బయట ఒకరితో రిలేషన్ లో ఉన్న వీళ్లు. ఇలా హౌజ్ లో కలిసి ఆట ఆడుతూ ఒకరిని ఒకరు ఇష్టపడటం అందరికి షాక్ ఇస్తుంది. వాళ్లకి ఎలా ఉందో కాని చూస్తున్న ఆడియెన్స్ మాత్రం వీరి  హగ్గులు, కిస్సులు చూడలేకపోతున్నారు. షణ్ముఖ్ ఇప్పటికీ టైటిల్ రేసులో ఉన్నాడు. ఒకవేల అతను టైటిల్ గెలవకపోతే మాత్రం సిరి వల్లనే అతను టైటిల్ కు దూరమయ్యాడు అని మాత్రం పక్కగా చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: