రాశిఖన్నా ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎంతో గుర్తింపు ఉన్న హీరోయిన్. ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోయింది ఈ అమ్మడు. అయితే ఈ అమ్మడు చేసిన సినిమాలు మంచి విజయాలను సాధించినప్పటికీ రాశిఖన్నా మాత్రం అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది అనే చెప్పాలి. అయితే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ అమ్మడికి అవకాశాలు కాస్త తక్కువ అయ్యాయి. కొత్త హీరోయిన్ల రాకతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పోటీ కూడా పెరిగిపోయింది. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలు లేక పోయినప్పటికీ అటు తమిళ చిత్ర పరిశ్రమలో మాత్రం వరస అవకాశాలు అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.


 ఈ క్రమంలోనే కేవలం కమర్షియల్ సినిమాల విషయంలోనే కాదు విభిన్నమైన కథాంశంతో కూడిన సినిమాల్లో కూడా నటించి సిద్ధమవుతోంది. ఇలా విభిన్న కథాంశంతో ప్రస్తుతం తెరకెక్కుతున్న తమిళ చిత్రం 'అరుణ్ముణ్తై'  ఈ సినిమాకు సుందర్.సి దర్శకత్వం వహిస్తున్నారు.  సినిమాలో రాశి కన్నా, ఆండ్రియా హీరోయిన్లుగా నటిస్తుండగా ఆర్య హీరోగా నటిస్తున్నాడు. ఉదయనిధి స్టాలిన్, అరుణ్ కుమార్ సమర్పణలో ఈ సినిమా నిర్మితమవుతోంది. అంతఃపురం  పేరుతో తెలుగులో కూడా ఈ సినిమా విడుదల కాబోతున్న తెలుస్తోంది.


 ఈ నెల 31వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. అయితే ఇప్పటి వరకు రాశి కన్నా ఎంతో చలాకి పాత్రల్లో నటించింది అంతేకాదు కామెడీ పాత్రలు కూడా నటించింది. కానీ మొదటిసారి తన కెరియర్లోనే హర్రర్ పాత్రలో రాశి ఖన్నా కనిపించబోతుందట. అయితే ఇప్పటికే అరుణ్ముణ్తై-1 సినిమా తెలుగు రీమేక్ చంద్రకళ, అరుణ్ముణ్తై 2 కళావతి గా విడుదలయ్యాయి. ఇప్పుడు అంతపురం అనే పేరుతో తెలుగులో విడుదల కాబోతోంది మూడవ సీక్వల్. అయితే ఇక రాశి ఖన్నా హారర్ పాత్రలో అనేసరికి ఫ్యాన్స్ అందరూ షాక్ అవుతున్నారు.  ఇప్పటి వరకు ఎంతో అందంగా కనిపించిన రాశికన్న హారర్ పాత్రలో దయ్యం లాగా కనిపిస్తే చూడగలమా అని అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: