యువరత్న నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమా అఖండ . రెండు వారాల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూప‌ర్ టాక్ తో జర్నీ ప్రారంభించి తిరుగులేని సూపర్ డూపర్ హిట్ అయింది. బోయపాటి శ్రీను - బాలయ్య కాంబినేషన్లో వచ్చిన సింహా , లెజెండ్ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తాజాగా వీరి కాంబినేషన్లో మూడో సినిమా గా వచ్చి బాలయ్య - బోయపాటి కాంబినేషన్ దమ్ము ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది.

అఖండ బాలయ్య-బోయపాటి కాంబోలో హ్యాట్రిక్‌ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే తొలి వంద కోట్ల సినిమాగా రికార్డులకు ఎక్కింది. సినిమాపై ముందు నుంచి ఉన్న భారీ అంచనాలను బోయపాటి అందుకున్నారు. సినిమాలో అఖండ పాత్రకు ప్రేక్షకులు అలా కనెక్ట్ అయిపోయారు. బోయపాటి మాస్ ఎలిమెంట్స్ తో  పాటు బాలయ్య డైలాగులు , థ‌మ‌న్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో థియేటర్లు ద‌ద్ద‌రిల్లాయి.

అఖండ గురువారంతో 15 రోజులు పూర్తి చేసుకుంది. పదిహేను రోజుల టైం లో ఈ సినిమాకు 10 కోట్లకు పైగా ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర అవుతోంది 15 రోజుల కు అఖండ 64 కోట్ల నెట్ కలెక్షన్ రాబట్టింది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా యాభై మూడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ లెక్కన చూస్తే ఇప్పటివరకు పది కోట్లకు పైగా లాభాలను అందుకుంది.

ఏపీలో టికెట్ రేట్లు తగ్గకుండా ఉన్నట్లయితే అఖండ్ కు మరో రు. 15 కోట్లకు పైగా లాభాలు వచ్చేవని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక అఖండ సినిమాలో బాలయ్య రైతు పాత్ర మురళీకృష్ణ గా, అఖండ‌ పాత్రలో కనిపించారు. బాలయ్యకు జోడీగా హీరోయిన్ గా ప్ర‌గ్య జైశ్వాల్ నటించింది. ప్రస్తుతం బాల‌య్య మ‌లినేని గోపీచంద్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: