తెలుగు చిత్ర పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మలు మొదటి సినిమా హిట్ అయితే వారి ఆనందానికి అవధుల్లేవు. డైరెక్టర్స్ కూడా ఆ హీరోయిన్ తో సినిమాలు చేయాలనీ తెగ హడావిడి చేస్తారు. అలా ఎటువంటి ఆర్భాటం లేకుండా అందం, నటన తో మంచి తెచ్చుకున్న హీరోయిన్ లలో ఒకరు అనుష్క శెట్టి.. సూపర్ సినిమా చిత్ర పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తర్వాత వరుస హిట్ సినిమా లలో నటించి అభిమానుల హృదయాలను దొచుకుంది.


బాహుబలి లాంటి పాన్ ఇండియా మూవీలో నటించి ప్రపంచ వ్యాప్తంగా హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రభాస్ తో ఎన్నో సినిమాలు చేసింది. వీరిద్దరి మధ్య ఎన్నో రూమర్స్ వచ్చినా కూడా లెక్క చేయలేదు. మేము మంచి ఫ్రెండ్స్ అని తేల్చి చెప్పింది. ఆ తర్వాత భాగమతి వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది మన జెజెమ్మ. మిగిలిన హీరోయిన్లు వారి గురించి సమాచారాన్ని అభిమానుల తో పంచుకుంటారు.


కానీ, అనుష్క మాత్రం తన కుటుంబ విషయాల గురించి ఎవరికీ చెప్పుకోలెదు. అందుకే చిత్ర పరిశ్రమ లో ముద్దుగా స్వీటీ అని పిలుస్తారు.16 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఈ దేవసేనకు స్టార్ హీరో లతో సమానంగా క్రేజ్ ఉంది. ఈ అమ్మడు తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చి పదహారేళ్ళు పూర్తి చేసుకుంది. ఇటీవలె 40 వ పుట్టిన రోజును జరుపుకుంది.ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ బొద్దుగుమ్మ చేతిలో సినిమాలు లేనట్లు తెలుస్తుంది. ఇక సినిమాలు చెస్తుందొ లేదో చూడాలి.. సైలెంట్ అవ్వడానికి కారణాలు మాత్రం తెలియలేదు. మొన్నీమధ్య సోషల్ మీడియాలో పెళ్ళి ప్రస్తావన వచ్చింది. స్మైల్ ఇచ్చి తప్పించుకుంది. ఇప్పటికైనా పెళ్ళి చేసుకొనే ఆలోచన చెస్తుందొ లేదో టాలివుడ్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. దీనిపై మరోసారి మనసు మార్చుకుంటుందేమో చూద్దాం..

మరింత సమాచారం తెలుసుకోండి: