ఉప్పెన సినిమా తో ప్రేక్షకులందరి నీ తన అందచందాల తో మంత్ర ముగ్ధులను చేసింది హీరోయిన్ కృతి శెట్టి. అతి చిన్న వయసులో నే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతో తన అభినయంతో ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ అయ్యే ఫీచర్స్ ని కనబరిచింది. దానికి తోడు ఉప్పెన సినిమా కూ డా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా టాలీవుడ్ మేకర్స్ దృష్టి ఈ ముద్దుగుమ్మ పై పడింది. హీరో కంటే ఎక్కువగా ఉప్పెన సినిమా లో క్రేజ్ అందుకుంది.

సినిమా ద్వారా ఆమెకు మంచి పేరు వచ్చిందని చెప్పాలి. కొన్ని కొన్ని సీన్స్ లలో ఎంతో అనుభవం ఉన్న నటీమణిగా చేసి అందరితో శభాష్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో ఈమె టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ అవుతుందని చెప్పారు కొంతమంది సినీ పండితులు. వారు చెప్పినట్లుగానే ఆ సినిమా విడుదల కాకముందే ఆమెకు చాలా సినిమా అవకాశాలు వచ్చాయి. విడుదలైన తర్వాత ఆమెకు వచ్చిన సినిమా అవకాశాల లిస్ట్ భారీగానే ఉంది. అలా ఆమె నాని హీరోగా నటించిన శ్యామ్ సింగ రాయ్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

ఉప్పెన సినిమాలో ఎంతో సంప్రదాయంగా కనిపించే అమ్మాయి గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో పక్కా కమర్షియల్ గ్లామర్ రోల్ చేసినట్లు గా ట్రైలర్ లో ఆమె సీన్స్ ను బట్టి తెలుస్తుంది. దాని తో పాటు లిప్ లాక్ సీన్లు కూడా నటించడం పట్ల ఈమె భవిష్యత్తు లో గ్లామర్ హీరోయిన్ గా ఎదగాలనుకుంటున్నా అనే సూచనను అందిస్తుంది. ఇక ఆమెను ఈ సినిమా లో చూసిన ప్రేక్షకులు భవిష్యత్తులో ఈమె ఏ రేంజ్ లో నటిస్తుందో అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి కృతి ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: