నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబో సినిమా అంటే అది పక్కా హిట్ అని నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు కామన్ ఆడియెన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. అఖండ సినిమాలో ఆధ్యాత్మిక పాయింట్ టచ్ చేసి ప్రేక్షకుల మనసులు గెలిచాడు బాలయ్య బాబు. రిలీజైన దగ్గర నుండి సినిమా వసూళ్ల బీభత్సం సృష్టించగా 3 వారాలు దాటాక అఖండ బాలకృష్ణ కెరియర్ లో హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచింది.

బాలకృష్ణ డ్యుయల్ రోల్.. బోయపాటి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే.. థమన్ అదిరిపోయే మ్యూజిక్.. అఖండ సినిమాకు ఇవన్ని హైలెట్ గా నిలిచి సినిమాను బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ చేశాయి. అఖండ సినిమాలో శ్రీకాంత్ విలనిజం కూడా ప్రేక్షకులను మెప్పించింది. ప్రగ్యా జైశ్వాల్ గ్లామర్ సినిమాకు ప్లస్ అయ్యింది. సినిమాలో అఘోరాగా బాలకృష్ణ పర్ఫార్మెన్స్ ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇచ్చింది.  18 రోజుల్లో ఈ సినిమా 76 కోట్లతో బాలకృష్ణ కెరియర్ లో ఇదివరకు ఎప్పుడూ క్రియేట్ చేయని రికార్డ్ సృష్టించింది అఖండ.        

సింహా, లెజెండ్ తర్వాత బోయపాటి, బాలకృష్ణ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ఎలా ఉండాలో ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అంతకుమించిన మాస్ ఫోర్స్ తో ఈ అఖండ వచ్చింది. సినిమా ఓపెనింగ్ డే నుండే రికార్డ్ కలక్షన్స్ సృష్టిస్తున్న అఖండ బాలయ్య కెరియర్ లోనే బెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలవడం విశేషం. అఖండ హిట్ బాలయ్య లో మంచి జోష్ తెచ్చింది. అదే జోరుతో తన నెక్స్ట్ సినిమా గోపీచంద్ మలినేని డైరక్షన్ లో చేస్తున్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న బాలకృష్ణ, గోపీచంద్ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు వేటపాలెం టైటిల్ పరిశీళనలో ఉన్నట్టు టాక్. క్రాక్ లో జయమ్మగా నటించిన వరలక్ష్మి కూడా బాలయ్య మూవీలో రిపీట్ చేస్తున్నాడట డైరక్టర్ గోపీచంద్ మలినేని.    


మరింత సమాచారం తెలుసుకోండి: