అక్కినేని నాగ చైతన్య బాగా పాపులారిటీ తెచ్చుకున్న ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, అతి తక్కువ సమయంలోనే మంచి హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.. ఇక ప్రస్తుతం కొన్ని సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న నాగచైతన్య లవ్ స్టోరీ సినిమాతో ఊహించని విజయాన్ని అందుకొని, ఆ సక్సెస్ నుంచి ఇంకా ఈయన తేరుకోలేదు అని చెప్పాలి. ఇక మరోవైపు తన తండ్రి నాగార్జునతో కలిసి బంగార్రాజు సినిమా లో నటించబోతున్నారు నాగచైతన్య. నాగచైతన్య సినిమాలలో కొనసాగుతూనే మరొకవైపు తన హాబీలతో కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం..ఇకపోతే నాగచైతన్య కి ఉన్న హాబీలు ఏమిటి..? వాటి వల్ల ఆయనకు వచ్చిన గుర్తింపు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు ఒక్కసారి గనుక మనం చూసినట్లయితే.. నాగచైతన్యకి బైకులు, కార్లు అంటే మహా ఇష్టమట. చాలా సార్లు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పెంచుకోవడమే కాకుండా కొన్ని రకాల కార్లు, బైకులు గురించి కూడా ఎన్నో విషయాలను ప్రేక్షకులకు తెలియజేశాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఈయనకు రేసింగ్ కార్ లు అంటే పిచ్చి అట. ఇక ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అని చెప్పవచ్చు. ఇక రేసింగ్ చూడడానికి కూడా తరచు వెళ్తూ ఉంటాడట నాగచైతన్య.. అంతేకాదు ఒకానొక సందర్భం లో ఫార్ములా వన్ రేసర్ డేవిడ్ కౌల్ థార్డ్ ను కూడా కలిశాడు.ఇక నాగచైతన్య దగ్గర రెడ్ కలర్ ఫెరారీ కారు కూడా ఉంది.. ఇక ఆయన ఆ కార్ ను ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసి, ఫోటోలు దిగి .. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాడు. ఫెరారీ కారు లో తన మాజీ భార్య సమంతతో కలిసి ఔటింగ్ వెళ్ళినప్పుడు తీసుకున్న ఫొటోలను కూడా షేర్ చేశారు. ఇక అంతే కాదు ఈయనకు కొన్ని స్పోర్ట్స్ బైక్ రకాలు అంటే కూడా ఎంతో ఇష్టమట.

మరింత సమాచారం తెలుసుకోండి: