ప్రభాస్, పూజా హెగ్డే నామినేషన్లు వస్తున్నా మూవీ రాధేశ్యామ్. ఇక ఈ సినిమా ఒక పీరియాడిక్ లవ్ స్టోరీ గా డైరెక్టర్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఒక విభిన్నమైన పాత్రల్లో ప్రభాస్ పెదనాన్న.. కృష్ణంరాజు కూడా నటిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈయన చేసే పాత్ర ఒక లెజెండరీ పాత్ర కావడం కూడా విశేషం. ఇక అందుకు సంబంధించి ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు మూవీ మేకర్స్. రాధే శ్యామ్ సినిమాలో పరమహంస అనే క్యారెక్టర్ లో కృష్ణంరాజు కనిపించబోతున్నారు.


ఇక పోస్టర్ విషయానికి వస్తే.. ఒక సీనియర్ నటుడు గా కాషాయ వస్త్రాలను ధరించి, చేతిలో రుద్రాక్ష పట్టుకొని.. ఒక గురువుగా కనిపించారు. ప్రస్తుతం ఆయన వయస్సు 81 సంవత్సరాలు అయినప్పటికీ.. ఈ సినిమాలో నటించేందుకు బరువు కూడా కాస్త తగ్గినట్టు సమాచారం. దీంతో ఆయన అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ పాత్ర కేవలం తెలుగు భాషలోనే నటించనున్నట్లు గా తెలుస్తోంది. మిగతా అన్ని భాషలలో కట్టప్ప సత్యరాజ్ నటించే విధంగా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా  రెబల్ స్టార్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నా సమయం ఇదే అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం వీరిద్దరు కలిసి నటిస్తే ఆ సినిమా డిజాస్టర్ అవుతుందని సెంటిమెంట్ను వీరీ ఆభిమానులు భయపడుతున్నారు.


ఇంతకుముందు వచ్చిన రెబల్, బిల్లా మూవీ లు కూడా కలిసి నటించిన మూవీస్ కూడా ఫ్లాపయ్యాయి. ఈసారి కూడా నటించడంతో కాస్త భయభ్రాంతులకు గురవుతున్నారు అభిమానులు. అయితే ఈసారి ఈ బ్యాట్ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారనే విషయాన్ని ని మరి కొంతమంది అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభాస్ ఈ సినిమాలు ఒక నిపుణుడు గా కనిపించబోతున్నారు. ఈ మూవీ జనవరి 14 న విడుదలవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: