ఫన్ అండ్ ఫ్రస్టేషన్.. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెలుగు భాషా హాస్య చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం ఎఫ్3 . ఇప్పటికే ఎఫ్ 2 సినిమా వచ్చి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఎఫ్2 సినిమాకి సీక్వెల్ గా ఎఫ్ 3 సినిమాను తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అభిమానుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఇకపోతే మొదటి సినిమాలో వెంకటేష్ ,వరుణ్ తేజ్, మెహరీన్ , తమన్నా కలిసి నటించి తమ పాత్రలను తిరిగి రెండవ భాగంలో కూడా కంటిన్యూ చేస్తున్నారు.
ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే .. ఈ సినిమాలో నటించడానికి మెహరిన్ ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత కూడా తన కాబోయే భర్తతో గొడవపడి మరి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అయితే అతనితో బ్రేకప్ చెప్పిన విషయం అందరినీ ఆశ్చర్యానికి కలిగించిన విషయం తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే ఆమెకు సినిమాలపై ఎంత ఆసక్తి ఉందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక పోతే ఈ సినిమాకు మ్యూజిక్ ను మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ఇకపోతే ఎఫ్ త్రీ సినిమా ను అప్పట్లోనే విడుదల చేయాలని ఎన్నో ఆలోచనలతో షూటింగ్ మొదలుపెట్టారు.. కానీ కరోనా కారణంగా నిర్మాణం  ఆలస్యం కావడం ఫలితంగా విడుదల కూడా వాయిదా పడింది..
ఎట్టకేలకు అటు మెగా అభిమానులకు ఇటు దగ్గుబాటి ఫ్యాన్స్ కి శుభవార్త తెలుపుతూ 2022 ఫిబ్రవరి 25వ తేదీన థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు అని ప్రకటించిన విషయం తెలిసిందే.. కానీ ఏమైందో తెలియదు కానీ మళ్లీ ఈ సినిమాను వాయిదా వేశారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా అనిల్ రావిపూడి తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేయడం గమనార్హం. తాజాగా అనిల్ రావిపూడి ఏప్రిల్ 29 2022న సమ్మర్లో బాక్సాఫీస్ బద్దలు కొట్టడానికి సిద్ధమవుతున్నామంటూ పోస్టర్లు రిలీజ్ చేయడంతో ప్రతి ఒక్కరు కొద్దిగా నిరాశ చెందారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: