హాట్ డ్యూటీ రాశి ఖన్నా,  నాగ శౌర్య హీరో గా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా మంచి విజయం సాధించడం తో పాటు ఈ హాట్ బ్యూటీ అంద చందాలకు, నటనకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడడంతోరాశి కన్నా కు తెలుగులో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. అలా తెలుగు లో అనేక సినిమాల్లో నటించిన ఈ ముద్దు గుమ్మ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది, ఇలా తెలుగు లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీ పై కూడా తన ఫోకస్ ను పెట్టింది, అందులో భాగంగా ప్రస్తుతం రాశి కన్నా 'అరణ్మనై త్రీ' అనే  హర్రర్ సినిమాల్లో నటిస్తోంది. 

ఈ సినిమాలో ఆర్య హీరోగా నటిస్తుండగా,  సుందర్ సి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.  అయితే ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల అయింది, ఈ ట్రైలర్ లో రాశి కన్నా ఎరుపు రంగు డ్రెస్ వేసుకొని అదిరి పోయే హాట్ హాట్ అందాలతో కనిపిస్తోంది,  ఈ సినిమాలో రాశి కన్నా ఎరుపు రంగు డ్రెస్ వేసుకుని ఉన్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి, ఇలా ఈ సినిమాలో తన అంద చందాలతో తమిళ ప్రేక్షకుల మనసును ఏ రేంజ్ లో రాశి కన్నా కొల్లగొడుతుందో తెలియాలంటే ఈ సినిమా విడుదల అయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే రాశి ఖన్నా ప్రస్తుతం నాగ చైతన్య హీరో గా తెరకెక్కుతున్న థాంక్యు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది, అలాగే గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది, వీటితో పాటు పలు వెబ్ సిరీస్ లలో కూడా రాశి కన్నా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: