అఖండ... నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ. సింహ, లెజండ్ తర్వాత బీబీ-3 గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ... ఇండస్ట్రీకి బూస్టర్‌లా మారింది. అసలే కరోనాతో తీవ్ర నష్టాల పాలైన టాలీవుడ్ పరిశ్రమకు ప్రస్తుతం అఖండ సినిమా కలెక్షన్లు కాస్త ఊరట ఇస్తున్నాయి. ఎప్పుడూ థియేటర్లకు రాని వారు కూడా అఖండ కోసం థియేటర్లకు వస్తున్నారు. అఖండ గెటప్‌లో బాలయ్య యాక్షన్ అదుర్స్ అంటూ కితాబులిస్తున్నారు. అటు అఖండ సినిమాపై విమర్శకులు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ నెల 2వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 16 వందలకు పైగా థియేటర్లలో విడుదలైన అఖండ... విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇక రిలీజ్‌కు ముందే దాదాపు 55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసేసింది. అలాగే వంద కోట్ల మార్క్ దాటిన తొలి చిత్రంగా బాలయ్య కెరీర్‌లో నిలిచిపోయింది అఖండ. ఇక ఈ విజయంతో... బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌ పై అంచనాలు మరింత పెరిగిపోయాయి కూడా. ఇక నందమూరి అభిమానులు అయితే.... బీబీ - 4 ఎప్పుడు  సార్ అంటూ బోయపాటిని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు కూడా.

ఓ వైపు అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప.. ది రైజ్ పార్ట్ వన్ సినిమా రిలీజ్ అయినా కూడా... అఖండ సినిమా కలెక్షన్లలో ఏ మాత్రం తేడా రాలేదు. అఖండ జోరు కొనసాగుతూనే ఉంది. ఓ వైపు పైరసీ ప్రింట్ ప్రస్తుతం నెట్‌లో ఉన్నప్పటికీ... థియేటర్లకు వస్తున్నారు ప్రేక్షకులు. ఇదే సమయంలో ఓటీటీలో అఖండ రిలీజ్ డేట్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అఖండ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ డిస్నీ హాట్ స్టార్ సంస్థ దక్కించుకుంది. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ఓటీటీలో విడుదల అవుతుందని అంతా భావించారు. అయితే మరో నాలుగు రోజుల్లోనే క్రిస్మస్ కావడంతో... ఓటీటీ ఎఫెక్ట్ సినిమా కలెక్షన్ పై పడుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. దీంతో... క్రిస్మస్‌కు బదులుగా... జనవరి ఒకటిన విడుదల చేసేందుకు హాట్ స్టార్ సంస్థ రెడీ అయ్యింది. జనవరి ఫస్ట్ కానుకగా... బాలయ్య అభిమానుల ఇంట అఖండ సందడి చేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: