నాచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమాలో సాయి పల్లవితో పాటుగా ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి కూడా నటించింది. ఉప్పెనతో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ అమ్మడు తన సెకండ్ సినిమాకే లిప్ లాక్ తో రెచ్చిపోయింది. ట్రైలర్ లోనే కృతి శెట్టి లిప్ లాక్ సీన్ ను చూపించి ఆమె ఫ్యాన్స్ కు సూపర్ కిక్ ఇచ్చేలా చేశాడు కృతి శెట్టి. శ్యామ్ సింగ రాయ్ సినిమాలో ఆమె కీర్తి పాత్రలో నటించినట్టు తెలుస్తుంది. ఈ పాత్ర డిమాండ్ మేరకు లిప్ లాక్ పెట్టాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. అంతేకాదు డైరక్టర్ రాహుల్ తనకు కథ చెప్పినప్పుడే కీర్తి క్యారక్టరైజేషన్ గురించి చెప్పారని నచ్చింది అందుకే దానికి ఒప్పుకున్నా అన్నది కృతి శెట్టి.

అయితే కృటి శెట్టి ఫార్మల్ గా అలా లిప్ లాక్ సినిమాలో భాగం కాబట్టి ఒప్పేసుకున్నా అని చెప్పినా సరే ఉప్పెన సినిమాలో కూడా హీరో వైష్ణవ్ తేజ్ తో ఓ లిప్ లాక్ చేసింది అమ్మడు. జల జల పాతం సినిమాలో కృతి శెట్టి, వైష్ణవ్ తేజ్ మూతి ముద్దులు తెలిసిందే. ఆ సినిమా సెంటిమెంట్ రిపీట్ చేస్తూ శ్యామ్ సింగ రాయ్ లో కూడా తన లిప్ లాక్ ఉంటే సినిమా హిట్ అనుకుంటుంది కృతి శెట్టి.

ఇలాంటి సెంటిమెంట్ పెట్టుకుంటే ఇక అమ్మడు చేసిన ప్రతి సినిమాలో ప్రతి హీరోతో అలాంటి ఓ లిప్ లాక్ సీన్ చేయాల్సి ఉంటుందని ఫ్యాన్స్ వాపోతున్నారు. కృతి శెట్టి వర్షన్ ఎలా ఉన్నా సరే శ్యామ్ సింగ రాయ్ సినిమాలో ఆమె పాత్ర చాలా బబ్లీగా సినిమాకు మంచి ఎంటర్టైనింగ్ గా ఉంటుందని అంటున్నారు. ఉప్పెనలో బేబమ్మగా మెప్పించిన కృతి ఇప్పుడు శ్యాం సింగ రాయ్ లో కీర్తిగా ప్రేక్షకులను అలరించాలని వస్తుంది. కృతి ఖాతాలో మరో సూపర్ హిట్ పడుతుందా అమ్మడు ద్వితీయ విఘ్నం దాటేస్తుందా అన్నది ఈ శుక్రవారం తేలిపోతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: