మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటితో చేస్తున్న క్రేజీ మూవీ గని. బాక్సింగ్ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ సయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ నిర్మిస్తున్నారు. ఇక వరుణ్ తేజ్ గని సినిమాలో మరో సర్ ప్రైజ్ హీరోయిన్ కూడా ఉందని తెలుస్తుంది. సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఉంటుందని రివీల్ చేశారు.

సినిమాలో ఆమె ఓ స్పెషల్ సాంగో.. లేక ఐటం సాంగో చేస్తుంది అనుకుంటే పొరపడినట్టే. గని సినిమాలో తమన్నా ఓ స్పెషల్ రోల్ చేస్తుందట. ఈ విషయాన్ని తమన్నా బర్త్ డే సందర్భంగా పోస్టర్ ద్వారా రివీల్ చేశారు చిత్రయూనిట్. ఓ విధంగా గనికి తమన్నా గ్లామర్ కూడా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. ఈమధ్య సీనియర్ స్టార్స్ తో పాటుగా యువ హీరోలతో కూడా కలిసి నటిస్తున్న తమన్నా ఓ పక్క వెంకటేష్, వరుణ్ తేజ్ లతో ఎఫ్3 చేస్తూనే సత్యదేవ్ లాంటి యువ హీరో తో గుర్తుందా శీతాకాలం సినిమాలో నటిస్తుంది.

సీనియర్ హీరోయిన్స్ లో ఇప్పుడు తమన్నా ఒక్కతే చేతినిండా సినిమాలతో కెరియర్ బిజీగా ఉంచుకుందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్ గనిలో కూడా తమన్నాది ప్రాముఖ్యత ఉన్న పాత్ర అని అంటున్నారు. మరి గ్లామర్ కోసమే మిల్కీ బ్యూటీని తీసుకున్నారా లేక నిజంగానే వరుణ్ తేజ్ గనిలో తమన్నా నటిస్తుందా అన్నది చూడాలి. ఇప్పటికే రెండు సార్లు రిలీజ్ డేట్లు అనుకుని వాయిదా పడ్డ వరుణ్ తేజ్ గని నెక్స్ట్ ఇయర్ మార్చ్ తర్వాత రిలీజ్ ఉంటుందని చెప్పుకుంటున్నారు.  వరుణ్ తేజ్ నటిస్తున్న ఎఫ్3 మూవీ మాత్రం ఏప్రిల్ 29న రిలీజ్ అవుతుంది. ఆ సినిమాకు ముందే గని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.    


మరింత సమాచారం తెలుసుకోండి: