'ఉరి' సినిమా అయ్యేంత వరకు విక్కీ కౌశల్‌ గురించి బాలీవుడ్ ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు. కానీ  సర్జికల్‌ స్ట్రైక్స్‌ కథాంశంతో వచ్చిన ఈ మూవీతో విక్కీ భవిష్యత్తే మారిపోయింది. జాతీయ స్థాయి పురస్కారంతో పాటు.. ప్రేక్షకుల నుంచి మంచి పేరు కూడా వచ్చింది. ఈ ఇమేజ్‌ని మరింత పెంచుకోవడానికి దేశభక్తి కథలకే ప్రాధాన్యత ఇస్తున్నాడు విక్కీ కౌశల్.జలియన్‌ వాలా బాగ్ నరమేథానికి కారకుడైన జనరల్‌ డయ్యర్‌ని చంపిన ఉద్ధమ్‌ సింగ్‌ కథాంశంతో ఒక సినిమా చేశాడు విక్కీ కౌశల్. 'సర్దార్‌ ఉద్దమ్' టైటిల్‌తో రూపొందిన ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలయింది. అలాగే 1971 ఇండో-పాక్ వార్‌లో ఆర్మీ స్టాఫ్‌కి చీఫ్‌గా వ్యవహరించిన 'శామ్‌ మనేక్షా' లైఫ్‌స్టోరీతో 'శామ్‌ బహదూర్' అనే సినిమా చేస్తున్నాడు.

కార్తీక్‌ ఆర్యన్ ఇప్పటివరకు యాక్షన్‌ జానర్‌లో అడుగుపెట్టలేదు. 'పతి పత్నీ ఔర్ ఓ, లవ్‌ ఆజ్‌కల్' అంటూ అమ్మాయిలు, పువ్వుల చుట్టూనే తిరిగాడు. అయితే ఈ కథలు బాక్సాఫీస్‌ దగ్గర పెద్దగా ప్రభావం చూపించలేదు. దీంతో పేటియాట్రిక్‌ స్టోరీస్‌లోకి వచ్చాడు కార్తీక్. రియల్‌ ఇన్సిడెంట్‌ ఆధారంగా 'కెప్టెన్ ఇండియా' అనే సినిమా చేస్తున్నాడు. రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న పైలెట్‌ కథాంశంతో తెరకెక్కుతోందీ సినిమా.

మాస్ మూవీస్‌ ట్రై చేసినా, మాస్‌ హీరో కాలేకపోతోన్న వరుణ్ ధావన్, మాసివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడానికి ఇండో-పాక్‌ వార్‌ బ్యాక్‌డ్రాప్‌లోకి వెళ్లిపోతున్నాడు. 1971 ఇండో-పాక్ వార్‌లో బసంతర్‌ ఘటనలో అమరుడైన అరుణ్ కేధార్‌పాల్‌ కథాంశంతో 'ఇక్కీస్' అనే సినిమా చేస్తున్నాడు.  ఇక సిద్ధార్థ్‌ మల్హోత్రా వార్‌డ్రామాలోకి వెళ్లిపోయాడు. కార్గిల్‌ యుద్ధంలో అమరుడైన కెప్టెన్ విక్రమ్ బాత్రా కథాంశంతో 'షేర్‌షా' అనే సినిమా చేశాడు. డైరెక్ట్‌ ఓటీటీలో విడుదలయిన ఈ మూవీకి క్రేజీ రెస్పాన్స్‌ వచ్చింది.

అజయ్ దేవగణ్‌ కూడా ఈ ఇండో-పాక్ వార్‌తో ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్ చెయ్యాలనుకున్నాడు. 1971 ఇండో-పాక్ వార్ టైమ్‌లో భుజ్‌ ఎయిర్‌ స్ట్రిప్‌ని ఓవర్‌నైట్‌లో రిపేర్ చేసిన 300 మహిళలు, ఎయిర్ ఫోర్స్‌ ఆఫీసర్ విజయ్‌ కర్ణిక్ కథాంశంతో 'భుజ్‌ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' సినిమా చేశాడు. అయితే ఈ మూవికి మిక్స్‌డ్ రెస్పాన్స్‌ వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: