సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా సర్కారు వారి పాట,  ఈ సినిమా ను కొన్ని నెలల  క్రితం సంక్రాంతి కానుక గా జనవరి 13 వ తేదీ న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అఫీషియల్ గా ప్రకటించింది,  ఆ తర్వాత అనూహ్యం గా జనవరి 7 వ తేదీ న దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరో లుగా, ఆలియా భట్ ఒలీవియా మోరీస్ హీరోయిన్ లుగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ను విడుదల చేయబో తున్నట్లు ప్రకటించడం తో చాలా కూల్ గా పోటీ వద్దు అనుకున్న మహేష్ బాబు ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తేదీ కి దాదాపు మూడు నెలల దూరం గా ఏప్రిల్ ఒకటో తేదీ న సర్కారు వారి పాట సినిమా ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు.

 ఇలా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం మహేష్ బాబు తన సినిమా ను వాయిదా వేసుకున్నాడు,  అయితే మహేష్ బాబు కు ఇది మొదటి సారి ఏమీ కాదు, ఇది వరకు బాహుబలి సినిమా విషయం లో కూడా మహేష్ బాబు తన శ్రీ మంతుడు సినిమా ను వాయిదా వేసుకున్నాడు, బాహుబలి సినిమా కొత్త రికార్డ్ లను సృష్టించ గా, ఆ తర్వాత విడుదలైన శ్రీ మంతుడు సినిమా కూడా నాన్ బాహుబలి రికార్డ్ లను సృష్టించింది, అయితే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా కోసం వెనక్కి తగ్గిన మహేష్ బాబు మరో సారి సర్కారు వారి పాట సినిమా తో తన సెంటిమెంట్ ను మళ్ళీ రిపీట్ చేసి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుం టుందో లేదో చూ డాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: