మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత..తాజాగా పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. పుష్ప పాన్ ఇండియా సినిమాలో ఊ అంటావా.. ఊ ఊ అంటావా.. ఐటమ్ సాంగ్ లో అల్లు అర్జున్ తో వేసిన స్టెప్పులు ప్రేక్షకులను బాగా అలరించాయి. అంతేకాదు తన స్టెప్ లతో అలరించి సందడి చేసినా వీరిద్దరిని చూసి ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ హిట్ కావడంతో సమంత ఐటమ్ సాంగ్ వల్లే ఈ సినిమా సూపర్ హిట్ అయిందని కొందరు అంటూ ఉండడం గమనార్హం. సమంత ఐటమ్ సాంగ్ లో చేయలేకపోయుండుంటే ఈ సినిమా విజయం సాధించలేదని కూడా చెబుతున్నారు.


ఇకపోతే సమంతకు సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది.. ఇకపోతే ఈ పాట లో సమంత చాలా సెక్సీగా కనిపించేందుకు గాను ఎంతో కష్టపడిందని సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది.. ఇంస్టాగ్రామ్ ద్వారా ఆమె తెలుపుతూ ఈ పాట కోసం నేను చాలా కష్టపడ్డాను.. అన్నిటికంటే సెక్సీ గా కనిపించడం కోసం చాలా ప్రయత్నాలు చేశానని ఆమె వివరించింది. అయితే తాను ఈ స్థాయిలో గుర్తింపు పొందడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ సమంత తెలిపింది..

సమంత తన సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న తరుణంలో అనుకోకుండా నాగచైతన్య ఆమె ఇంటికి వెళ్లి సంప్రదించినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ నాగచైతన్య సమంత ఇంటికి వెళ్ళింది నిజమే నంటూ కొంతమంది సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య బంగార్రాజు సినిమా షూటింగ్లో పాల్గొంటుండగా.. ఈ సినిమా షూటింగ్ తర్వాత థాంక్యూ ఫిలిం షూటింగ్ లో కూడా పాల్గొన బోతున్నారు. సమంత కూడా యశోద సినిమా లో నటించబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: