అందాల ముద్దు గుమ్మ పూర్ణ, అల్లరి నరేష్ హీరో గా తెరకెక్కిన సీమా టపాకాయ సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం తో పాటు ఈ ముద్దు గుమ్మ అంద చందాలకు, నటనకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడటం తో ఈ హాట్ బ్యూటీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో పర్వాలేదు అనే రేంజ్ లో సినిమా అవకాశాలు దక్కాయి, అందులో భాగంగా అనేక సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో నటించిన ఈ బ్యూటీ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది, ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం విడుదలైన అఖండ సినిమాలో పూర్ణ ఒక ముఖ్య పాత్ర ను పోషించింది. 

సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం తో పాటు ఈ ముద్దు గుమ్మకు కూడా మంచి పేరు తీసుకువచ్చింది,  పూర్ణ కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది, ఈ మధ్యే పూర్ణ త్రీ రోజెస్ అనే వెబ్ సిరీస్ లో నటించింది, ఇలా సినిమా లతో, వెబ్ సిరీస్ లతో బిజీ గా సమయాన్ని గడుగుతున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియా లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటు, తన షూటింగ్ అప్డేట్ లను,  డైలీ ఆక్టివిటీస్ ను అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది, ఇవి మాత్రమే కాకుండా ఈ హాట్ బ్యూటీ అప్పుడప్పుడు తన అందచందాలు ప్రదర్శితమయ్యే ల ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది, తాజాగా కూడా ఈ హాట్ బ్యూటీ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలో ఈ ముద్దు గుమ్మ మెరూన్ కలర్ చీర కట్టుకొని అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, పూర్ణ కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: