దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన 'విక్రమార్కుడు' సినిమా ఎంత పెద్ద హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.2006 లో విడుదలైన ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.అంతేకాదు జక్కన్న కి ఎంతో ఇష్టమైన సినిమా ఇది.నిజానికి మొదట ఈ సినిమాను పవన్ కళ్యాణ్ తో చేయాలని రాజమౌళి చాలానే ప్రయత్నాలు చేసాడు.కానీ అది వర్కవుట్ కాలేదు.దీంతో రవితేజ ని హీరోగా పెట్టి భారీ హిట్ అందుకున్నాడు రాజమౌళి.ఇక ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించాడు. అత్తిలి సత్తిబాబుగా ఒకవైపు నవ్విస్తూనే.. విక్రమ్ సింగ్ రాథోడ్ పాత్రలో తన పౌరుషాన్ని చూపించాడు.

ఇక ఈ సినిమాలో రవితేజ కు జోడీగా అనుష్క హీరోయిన్గా నటించింది. ఇక ఇదిలా ఉండగా సినిమాకి సీక్వెల్ చెయ్యాలని రాజమౌళి ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.కానీ రాజమౌళి ఇప్పట్లో ఖాళీ లేడు.అయితే మరో దర్శకుడు సంపత్ నంది విక్రమార్కుడు కి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు.అంతేకాదు ఇప్పటికే ఈ విషయమైసంపత్ నంది రవితేజ ను అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే రవితేజకి కూడా ఈ స్క్రిప్ట్ బాగా నచ్చేసింది. కానీ విక్రమార్కుడు సినిమాకి సీక్వెల్ చేస్తే అది రాజమౌళితో చేస్తేనే బాగుంటుందని రవితేజ సున్నితంగా తిరస్కరించాడట. 

దీంతో దర్శకుడు సంపత్ నంది అదే స్క్రిప్ట్ ను మరో హీరోతో వేరే టైటిల్ ఫిక్స్ చేసి చేయాలని డిసైడ్ అయ్యాడట. ఇక సంపత్ నంది తో సినిమాలు చేయడానికి నిర్మాతలు కూడా రెడీగా ఉన్నారు. హీరో కనుక ఫైనల్ అయితే ఆ ప్రాజెక్టు తెరకెక్కడం ఖాయమనే మాట వినిపిస్తోంది. ఇటీవల గోపీచంద్ తో తెరకెక్కించిన సిటిమార్ సినిమాతో ఫాంలోకి వచ్చిన సంపత్ నంది తర్వాత ప్రాజెక్ట్ పైనే ఇప్పుడు అందరి దృష్టీ పడిందనే చెప్పాలి. మరి విక్రమార్కుడు సీక్వెల్ లో రవితేజ కాకుండా మరే హీరో నటిస్తాడనేది తెలియాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడక తప్పదు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: