పుష్ప రాజ్ సినిమా నేషనల్ వైడ్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. సినిమా హిందీ వర్షన్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతుంది. పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ ఊర మాస్ యాటిట్యూడ్ కి హిందీ లో కూడా మాస్ ఆడియెన్స్ కనెక్ట్ అయ్యారు. అందుకే రోజు రోజుకి అక్కడ వసూళ్లు పెరుగుతూ వస్తున్నాయి. వీక్ డేస్ లో కూడా పుష్ప వసూళ్లు కాన్ స్టంట్ గా ఉన్నాయి అంటే అక్కడ పుష్ప హిట్ కొట్టినట్టే. ఇక ఏదైనా సినిమా హిట్టు పడితే క్రికెటర్స్ దాని మీద దృష్టి పెడతారు.

సరదాగా రీల్స్ కూడా చేసే అవకాశం ఉంది. లేటెస్ట్ గా పుష్ప సినిమాకు సంబందించి పుష్ప రాజ్ నీయవ్వ తగ్గేదేలే అన్నది క్రికెటర్ రవీంద్ర జడేజా రీల్ చేశాడు. పర్ఫెక్ట్ సింక్ తో రవీంద్ర జడేజా ఈ రీల్ చేశాడని చెప్పొచ్చు. తన సోషల్ మీడియాలో ఈ వీడియో షేర్ చేశాడు. పుష్ప రాజ్ జెనరల్ ఆడియెన్స్ ను మాత్రమే కాదు క్రికెటర్స్ ను కూడా ఆకట్టుకున్నాడని తెలుస్తుంది.

పుష్ప పార్ట్ 1 ది రైజ్ నేషనల్ వైడ్ గా ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యాడు. తెలుగుతో పాటుగా అన్ని భాషల్లో ఈ సినిమాను ఆడియెన్స్ రిసీవ్ చేసుకున్నారు. అందుకే ఆ ప్రభంజనం వసూళ్ల రూపంలో కనబడుతున్నాయి. పుష్ప సినిమా ఎంతగా ప్రభావం చూపించింది అన్నది రవీంద్ర జడేజా చేసిన రీల్స్ చూస్తే అర్ధమవుతుంది. పుష్ప పార్ట్ 1 పాన్ ఇండియా వైడ్ గా అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యాడని చెప్పొచ్చు. సుకుమర్ డైరక్షన్ లో తెరకెక్కిన పుష్ప మూవీలో కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. సినిమాలో మళయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సునీల్, అనసూయ కూడా సినిమాలో డిఫరెంట్ రోల్స్ తో మెప్పించారు.





మరింత సమాచారం తెలుసుకోండి: