ఒక‌ప్పుడు సాక్షి ఫ్యామిలీ ఇండ‌స్ట్రీతో చాలా ద‌గ్గ‌ర గా ఉండేది. ఆ విధంగా  డబుల్ థ‌మాకా పేరిట ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలు రాయించేది. పెద్ద సినిమా రిలీజ్ అంటే అదొక పెద్ద పండుగగా మార్చేది. అంత హైప్ ఇస్తూ పేజ్ కు కొత్త లుక్ తీసుకుని వ‌చ్చేది. కానీ ఇప్పుడు అలాంటివేవీ లేవు. నానీ అనే హీరో సాక్షి ఫ్యామిలీకి ఎన్ని సార్లు ఇంట‌ర్వ్యూలు ఇచ్చి ఉంటాడో..అవ‌న్నీ ఇప్పుడిక రావేమో! ఇండ‌స్ట్రీతో వైఎస్ జ‌గ‌న్ సంబంధాలు పూర్తిగా తెంపుకున్నార‌న్న‌దే స్ప‌ష్టం అవుతోంది. కేవ‌లం ప‌వ‌న్ ను టార్గెట్ గా చేసుకుని జ‌గ‌న్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌ను ఇరుకున పెడుతున్నార‌న్న‌దీ క్లిస్ట‌ర్ క్లియ‌ర్ గా అర్థం అవుతోంది. ఈ క్ర‌మంలో ఇండ‌స్ట్రీ కూడా ఇక‌పై వైసీపీకి సాయం చేసేలా లేరు.


వ‌చ్చే ఎన్నిక‌ల్లో మెగాస్టార్ మొద‌లుకుని చాలా మంది స్టార్లు స్టార్ క్యాంపైన‌ర్లుగా మారి వైసీపీకి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేయ‌వ‌చ్చు. అంతేకాదు సినిమా ఇండ‌స్ట్రీని మ‌రీ ఇంతగా వేధించిన సీఎం మ‌రొక‌రు లేర‌ని ఇప్ప‌టికే మెగాభిమానులు మండి ప‌డుతున్నారు. ఓ భారీ బ‌డ్జెట్ సినిమాను ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో విడుద‌ల చేస్తే త‌మ‌కు ద‌క్కేది ఏమీ ఉండ‌దు అని అంటున్నారు వీళ్లంతా! ఈ క్ర‌మంలో జ‌గ‌న్ మాత్రం అస్స‌లు త‌గ్గ‌డం లేదు నేరుగా వైరంనే కోరుకుంటున్నారు. తన రాజ‌కీయ ప్ర‌గ‌తికి అడ్డంగా ఉన్న ప‌వ‌న్ ను త‌ప్పించాల‌ని ఎప్ప‌టి నుంచో ఆలోచిస్తున్నారు. అందుకే ఆయ‌న‌ను లక్ష్యంగా చేసుకుంటే మిగ‌తా ఇండ‌స్ట్రీ అంతా త‌న దారికి వ‌స్తార‌ని ఆ విధంగా వచ్చే ఎన్నిక‌ల్లో వీళ్ల‌ను ఆర్థికంగా కూడా వినియోగించుకుని రాజ‌కీయంగా, సామాజికంగా ఎద‌గ‌వ‌చ్చ‌న్నది జ‌గ‌న్ ప్లాన్.. అని ప‌రిశీల‌కులు అంటున్నారు. 




తాజాగా టికెట్ ధ‌ర‌ల త‌గ్గింపు, నిబంధ‌న‌ల పేరుతో వివిధ థియేట‌ర్ల పై దాడులు త‌దిత‌ర ప‌రిణామాల రీత్యా శ్యామ్ సింగ రాయ్ కు అనేక ఇబ్బందులు త‌లెత్తాయి. దీంతో నానీ కొత్త సినిమాకు చాలా థియేట‌ర్లు అందుబాటులో లేకుండా పోయాయి. మారిన ధ‌ర‌ల‌కు అనుగుణంగా త‌గ్గించిన రేట్లు కార‌ణంగా తాము థియేట‌ర్లు న‌డ‌ప‌లేమ‌ని ప‌లువురు చేతులెత్తేస్తున్నారు. దీంతో ఒక్క కృష్ణా జిల్లాల‌లోనే ఆరు థియేట‌ర్లు మాత్రం శ్యామ్ సింగ రాయ్ సినిమాను ఆడించేందుకు ముందుకువ‌చ్చాయి. మొత్తం 36 థియేట‌ర్ల‌లో ఆరు మాత్ర‌మే సినిమాను న‌డిపేందుకు ముందుకు రావ‌డం గ‌మ‌నార్హం.




మరింత సమాచారం తెలుసుకోండి: