అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటనకు, అందచందాలకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో కృతి శెట్టి కి తెలుగులో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి, ఇలా నటించిన ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్,  బంగార్రాజు, మాచర్ల నియోజకవర్గం,  రామ్ పోతినేని సరసన ఒక సినిమాలో నటిస్తోంది. 

ఈ ముద్దుగుమ్మ నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా డిసెంబర్ 24 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది, ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అంతే ఆక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను   పంచుకుంటూ  ఉంటుంది, సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు తన అభిమానులకు టచ్ లో ఉండే ఈ హాట్ బ్యూటీ తన సినిమా షూటింగ్ అప్డేట్ లను, ఇతర విషయాలను కూడా వారితో పెంచుకుంటూ ఉంటుంది, ఇది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తన ఫోటోలను కూడా సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది, అయితే తాజాగా కూడా కృతి శెట్టి కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. కృతి శెట్టి పోస్ట్ చేసిన ఈ ఫోటోలను సాంప్రదాయబద్దంగా లంగా ఓని ధరించి చాలా క్లాస్ లుక్ లో డీసెంట్ గా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ప్రస్తుతం కృతి శెట్టి కి సంబంధించిన ఈ ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: