సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్, అదిత్ తరుణ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో రామంత్ర క్రియేషన్స్ పతాకంపై రవి ప్రసాద్ రాజు దాట్ల డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు ( ఎవరు, ఎక్కడ,ఎందుకు) సినిమాను నిర్మించారు. మొదటిసారిగా కంప్యూటర్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 24న స్త్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ లు,పాటలు ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది.

కథ : ఇందులో అదిత్ అరుణ్ విశ్వ‌ గా న‌టిస్తుండ‌గా, శివాని రాజ‌శేఖ‌ర్ మిత్ర పాత్ర పోషిస్తుంది. వారి మిత్రులుగా అష్ర‌ఫ్ పాత్ర‌లో ప్రియ‌ద‌ర్శి, చిష్ట్రి పాత్ర‌లో దివ్య శ్రీ‌పాద న‌టిస్తున్నారు. వైవా హర్ష, సత్యం రాజేష్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తుండగా న‌టుడు రియాజ్ ఖాన్ ఖాన్‌ పాత్ర‌ధారిగా కనిపించ‌నున్నారు.చిష్ట్రీ కి మిత్ర మంచి ఫ్రెండ్..చిష్ట్రీ ద్వారా విశ్వ‌కి మిత్ర ప‌రిచ‌యమ‌వుతుంది. ఒక సారి మిత్ర ఫ్యామిలీకి.. విశ్వ హెల్ప్ చేయడంతో ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారుతుంది. మిత్ర ఒక రోజు చిష్ట్రీ ఇంటికి వెళుతుంది. అయితే ఉన్నట్టుండి కరోన కారణంగా రాత్రికి రాత్రే సంపూర్ణ లాక్ డౌన్ విధించడంతో మిత్ర అక్కడే లాక్ అయిపోతుంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి  ఫ్లాట్ లోకి చొరబడి.. చిష్ట్రీని విచక్షణా రహితంగా పొడిచేసి గాయాపరుస్తాడు. మిత్రను కూడా చిత్రహింసలకు గురిచేస్తాడు. దీన్ని వర్చువల్ గా చూసిన విశ్వ హాతాశుడైపోయి… ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు. అస‌లు ఆ వ్య‌క్తి ఎవ‌రు?, విశ్వ‌ని ఎందుకు ఉరివేసుకుని చావ‌మ‌న్నాడు. ఆ వ్య‌క్తి నుండి విశ్వ మిత్ర‌, చిష్ట్రిల‌ను కాపాడాడా లేదా అన్నది క‌థ‌.

 సాంకేతికత :  ఈ సినిమాకి గుహ‌న్ మేకింగ్ తో పాటు సినిమాటోగ్ర‌ఫి కూడా చాలా ప్ల‌స్ అయింది. కొన్ని స‌న్నివేశాల్లో విజువ‌ల్స్ గూజ్‌బ‌మ్స్ తెప్పించేలా ఉన్నాయి.  సైమన్‌ కె. కింగ్ సంగీతం, నేప‌థ్య సంగీతం  ఆక‌ట్టుకుంటూనే పాట‌ల‌తో ప్రేక్ష‌కుల్ని ఆశ్య‌ర్య‌ప‌రిచాడు. అన్ని పాట‌లు స్క్రీన్ మీద ప్ల‌జెంట్‌గా ప్రొజెక్ట్ చేయ‌బ‌డ్డాయి. తమ్మిరాజు  క్రిస్పి ఎడిటింగ్ బాగుంది..ఇక రామంత్ర క్రియేష‌న్స్ నిర్మాణ విలువ‌ల్ని త‌ప్ప‌కుండా మెచ్చుకోవాల్సిందే..ఈ క‌థ‌ను కేవ‌లం ఆన్‌లైన్‌లోనే విని మొద‌టిసినిమాగా ఒక డిఫ‌రెంట్ చిత్రాన్ని ఎంచుకోవ‌డం గొప్ప విష‌యం అని చెప్పవచ్చు.

టైటిల్‌:   “WWW”(ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు)              
న‌టీన‌టులు: అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్, ప్రియదర్శి, దివ్య, సందీప్‌, రియాజ్ ఖాన్, సత్యం రాజేష్ వైవా హర్ష,తదితరులు
స‌మ‌ర్ఫ‌ణ‌: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌
బ్యానర్‌: రామంత్ర క్రియేషన్స్
కథ, స్క్రీన్‌ ప్లే, సినిమాటోగ్రఫి, దర్శకత్వం: కె వి గుహన్
నిర్మాత: డా. రవి ప్రసాద్ రాజు దాట్ల
కో–ప్రొడ్యూసర్‌: విజయ్‌ ధరణ్‌ దాట్ల
సంగీతం: సైమన్‌ కె. కింగ్
ఎడిటింగ్‌: తమ్మిరాజు
ఆర్ట్‌: నిఖిల్‌ హాసన్
డైలాగ్స్‌: మిర్చి కిరణ్
లిరిక్స్‌: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, రోల్‌రైడా
కాస్ట్యూమ్‌ డిజైనర్‌: పొన్మని గుహన్
విడుద‌ల తేది: 24-12-21(సోనిలీవ్‌).

 రేటింగ్ : 3/5

మరింత సమాచారం తెలుసుకోండి:

www