టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు, భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది, ఆ తర్వాత కూడా  ఈ హీరో నటించిన హలో,  మిస్టర్ మజ్ను సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలయ్యాయి. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస పరాజయాలను ఎదుర్కొన్న ఈ  హీరో తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు, ఇలా కెరీర్ లో మొదటి విజయాన్ని అందుకున్న ఈ హీరో ప్రస్తుతం టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

 ఆ మధ్య కొన్ని రోజుల క్రితం ఈ సినిమాను డిసెంబర్ 24వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు,  కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను చిత్ర బృందం అనుకున్న తేదీకి విడుదల చేయలేకపోయింది, అయితే ఈ విషయంపై స్పందించిన ఈ సినిమా నిర్మాత అనిల్ సుంకర, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ఏజెంట్ సినిమా కాస్త ఆలస్యం కావచ్చు,  కానీ థియేటర్ లోకి వచ్చాక 1000 శాతం మెప్పిస్తుంది, ఒక బ్లాక్ బస్టర్ సినిమాగా నిలుస్తుంది అని తెలియజేశాడు, ఇలా అనిల్ సుంకర ఇంత నమ్మకం తో చెప్పడంతో అక్కినేని అభిమానులు ఈ సినిమాపై అంచనాలను మరింతగా పెంచుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి 'సైరా నరసింహ రెడ్డి' లాంటి పాన్ ఇండియ సినిమా  తర్వాత ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై జనాలు భారీ రేంజ్ లో అంచనాలు పెంచుకున్నారు, ఈ సినిమాను చాలా స్టైలిష్ గా దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: