ఏపీలో జగన్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల అంశంలో వ్యూహాత్మకంగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. సినిమా టిక్కెట్లని తామే అమ్ముతామని, అలాగే సామాన్యులకు అందుబాటులో ఉండాలని చెప్పి టిక్కెట్ల రేట్లని కూడా తగ్గించారు. ఇక ఈ అంశం సినిమా ఇండస్ట్రీ వారికి మింగుడు పడటం లేదు. రేట్లు తగ్గడం వల్ల పెద్ద సినిమాలు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అందుకే దీనిపై థియేటర్ల యాజమాన్యాలు కోర్టుకు కూడా వెళ్ళాయి. అలా కోర్టుకు వెల్లడమే ఆలస్యం..ఇలా ప్రభుత్వం థియేటర్లపై రైడ్లు మొదలుపెట్టింది. దీంతో కొన్ని థియేటర్లు మూతపడిపోతున్నాయి. అలాగే తక్కువ ధరలకు సినిమాలు నడపలేమని చెప్పి కొన్ని థియేటర్లు స్వచ్ఛందంగా మూత వేసుకుంటున్నారు. ఈ పరిస్తితుల నేపథ్యంలో ప్రస్తుతం ఆడుతున్న పెద్ద సినిమాలకు బాగా ఇబ్బంది అవుతుంది.

అయితే సినిమా టిక్కెట్ల అంశంపై హీరో నాని స్పందించిన విషయం తెలిసిందే. తక్కువ రేట్లుకు అమ్మడం, ప్రేక్షకులని అవమానించడమే అని, థియేటర్ల కంటే పక్కనే ఉన్న కిరాణా షాపు వాడికే ఎక్కువ కలెక్షన్లు వస్తాయని అన్నారు. ఇక దీనికి వరుసపెట్టి ఏపీ మంత్రులు కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. బొత్స సత్యనారాయణ, కన్నబాబులు నానికి కౌంటర్లు ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా కౌంటర్ ఇచ్చారు...హీరో నాని ఎవరో తెలియదని, కొడాలి నాని మాత్రమే తెలుసని అన్నారు. సామాన్యులకు అందుబాటులో ఉండాలనే టిక్కెట్ల రేట్లు తగ్గించామని చెప్పారు.

ఎడాపెడా రేట్లు పెంచి దోచుకుంటామంటే ఒప్పుకోమని అన్నారు. ఇదిలా ఉంటే వైసీపీ శ్రేణులు..సోషల్ మీడియాలో నానిపై ఫైర్ అవుతున్నారు. ఫస్ట్ రోజు థియేటర్లు ఫుల్ అవ్వని హీరోలు కూడా మాట్లాడుతున్నారని, సరిగ్గా ట్యాక్స్‌లు కట్టని ఘంటా నవీన్ బాబు చౌదరీ టిక్కెట్ల రేట్లు గురించి మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందని సెటైర్లు వేస్తున్నారు. ఇక నానిని కూడా కమ్మ కులం అని చెప్పి, చంద్రబాబు ఇమేజ్‌లతో కలిపి పోస్టులు వేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: