దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా అనుష్క హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా విక్రమార్కుడు, ఈ సినిమా 23 జూన్ 2006 న విడుదల అయ్యింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా కలెక్షన్ ల వర్షం కురిపించింది. విక్రమార్కుడు సినిమాతో రవితేజ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు, ఈ సినిమాలో అనుష్క తన అందచందాలతో, నటనతో ప్రేక్షకులను అలరించింది,  ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటించాడు, ఒక పాత్రలో దొంగగా కనిపించగా, మరొక పాత్రలో నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. దొంగ పాత్రలో నవ్వులు పూయించిన రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అంతే సీరియస్ గా కనిపించి ఇటు ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుంచి ప్రశంసలు పొందాడు.

ఈ సినిమాకు దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించాడు, అలాగే ఈ సినిమాకు కీరవాణి అందించిన సంగీతం కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచింది,  కీరవాణి సంగీతం ఈ సినిమా విజయంలో కీలక పాత్రను పోషించింది. అయితే ఇంత గొప్ప విజయం సాధించిన ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది అంటూ కొన్ని రోజులుగా అనేక వార్తలు బయటకు వస్తున్నాయి, కొన్ని రోజుల క్రితం ఈ సినిమాను తెలుగులో సంపత్ నంది దర్శకత్వం వహించబోతున్నాడు అంటూ కూడా వార్తలు వచ్చాయి, అయితే తాజాగా విక్రమార్కుడు సీక్వెల్ కు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. విక్రమార్కుడు సీక్వెల్ ను హిందీలో ప్లాన్ చేస్తున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది, ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు మాత్రం విక్రమార్కుడు సీక్వెల్ కు సంబంధించిన ఎలాంటి అఫీషియల్ ప్రకటన కూడా  ఇంతవరకు వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: