ఇటీవలి కాలంలో చాలామంది హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను సాధించినప్పటికీ సరైన స్టార్ డమ్ సంపాదించడానికి మాత్రం చాలా కష్టపడి పోతున్నారు. ఎన్నో సినిమాలు చేస్తే గానీ సరైన స్టార్ డమ్ సంపాదించలేక పోతున్నారు. కొన్ని కొన్ని సార్లు ఎన్ని సినిమాలు చేసినా స్టార్ డమ్ రాక కనుమరుగైపోతున్న హీరోయిన్లు కూడా చాలామంది ఉన్నారు. కొంతమందికి మాత్రమే అటు సినిమాలు విజయం సాధించడంతో పాటు ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి హీరోయిన్లలో నేటి రోజుల్లో ముందుగా చెప్పుకునేది కృతి శెట్టి పేరే. ఉప్పెన అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.



 డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో అటు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా పరిచయం కావడం గమనార్హం. ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించింది. అంతేకాదు తన అందం అభినయంతో దర్శకనిర్మాతలు చూపు సైతం ఆకర్షించింది. దీంతో ఏకంగా నాచురల్ స్టార్ నాని తో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. నాని హీరోగా రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కిన శ్యామ్ సింగరాయి సినిమాలో నటించింది కృతి శెట్టి.. ఇక ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.


 అయితే కీర్తి అనే డిఫరెంట్ పాత్రలో నటించింది కృతి శెట్టి. అంతేకాదండోయ్ ఈ సినిమాలో ఏకంగా సిగరెట్ తాగుతూ కనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక సినిమాల్లో సిగరెట్ తాగడం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాకు స్మోకింగ్ అంటే అస్సలు నచ్చదు. కానీ పాత్ర కోసం అదే ఛాలెంజింగ్ గా అనిపించింది. అయితే సిగరెట్ తాగే సీన్స్ ని తీసేయొచ్చు కదా అని దర్శకుడిని కోరినప్పుడు.. సిగరెట్ తాగేది సినిమాలో కీర్తి.. కానీ నువ్వు నిజ జీవితంలో కృతీ కదా అందుకే తేడా ఉండాలి అంటూ దర్శకుడు చెప్పారు. ఈ క్రమంలోనే ఆరోగ్య సేతు సిగరెట్లు తెప్పించుకొని మరి సిగరెట్ తాగడం  మూడు రోజులు ప్రాక్టీస్ చేశాను.  ఇక సిగరెట్ తాగుతూ ఫోటో షూట్ చేసినప్పుడైతే చేతులు వణికిపోయాయి అంటూ తన అనుభవాన్ని పంచుకుంది  కృతి శెట్టి.

మరింత సమాచారం తెలుసుకోండి: