ఉప్పెన సినిమాతో ప్రేక్షకులను ఒక్కసారిగా ఎంతగానో ఆకట్టుకుంది హీరోయిన్ కృతి శెట్టి. ఆమె తన కళ్ళ తోనే నటించేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తొలి సినిమాతోనే ఈ స్థాయిలో హిట్ అందుకున్న ఈ ముద్దు గుమ్మ తన తదుపరి సినిమాలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అందరూ భావించగా ఆమె చేసిన తదుపరి చిత్రం సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాని సరసన ఈమె శ్యామ్ సింగ రాయ్ అనే చిత్రంలో నటించగా ఈ సినిమాలో ఆమె పోషించిన గ్లామర్ పాత్రకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తుంది.

తొలి సినిమాలో ఎంతో సంప్రదాయంగా మంచి కట్టు బొట్టుతో తెలుగు అమ్మాయిల కనిపించిన ఈమె రెండో సినిమాలో ఒక్కసారిగా తన గ్లామర్ విశ్వరూపాన్ని చూపించే సరికి కొంత వరకు ప్రేక్షకులను ఆశ్చర్య పోయారు అని చెప్పవచ్చు. అయితే చివరకు గ్లామర్ పాత్రలు చేస్తే తనకు ఇమేజ్ ఎక్కువగా పెరుగుతుందనే విషయాన్ని గ్రహించిన ఈమె రెండో సినిమాకే ఈ రేంజిలో గ్లామర్ ను పంచి మరింతగా ప్రేక్షకుల అభిమానాన్ని పాపులారిటీ నీ సంపాదించుకుంది.

ఆ విధంగా ఈమె అభిమానులు పెట్టిన టెస్ట్ లో పాస్ అయింది అని అంటున్నారు. గ్లామర్ కథానాయికగా ఈమె ఎదుగుతుందా లేదా అని వారు మొదటి నుంచి భావించగా దానికి సమాధానంగా ఈ చిత్రంలోని గ్లామర్ పాత్ర చేసింది. ఇప్పుడు రామ్ సరసన కూడా ఆమె నటిస్తుంది. ఇందులో మరొక మంచి గ్లామర్ పాత్ర పోషిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇదే కొనసాగితే ఆమె తొందరలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదుగడం ఖాయం అని చెప్పవచ్చు. వాస్తవానికి గ్లామర్ పాత్రలు చేసే హీరోయిన్లకే ఈ రోజుల్లో ఎక్కువ పాపులారిటీ సినిమాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏ విధంగా కృతి శెట్టీ తన సినిమాల సంఖ్య పెంచుకుం టూ పోతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: