అలా వచ్చి ఇలా గడిచిపోయింది 2021 ఇంకో అయిదు రోజుల్లో నూతన సంవత్సరం రానుంది. ప్రతి ఏడు ఎన్నో సినిమాలు వస్తుంటాయి, వాటిలో కొన్ని బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి విజయాన్ని అందుకోగా కొన్ని పరాజయం పాలయ్యాయి. చాలా సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదలై నిరాశను మిగిల్చాయి. కాగా ఇపుడు 2021 లో ఎన్నో అంచనాలతో వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద తేలిపోయిన సినిమాలేంటో ఇపుడు చూద్దాం.

* డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్హకత్వంలో వచ్చిన సినిమా చెక్. ఇందులో నితిన్ హీరోగా చేశారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అందరినీ తీవ్రంగా నిరాశ పరిచింది.
* 'అల్లుడు శీను' పేరిట బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా సక్సెస్ కాగా ఈసారి 'అల్లుడు అదుర్స్' అనే సినిమాను తీసుకొచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ సినిమా అంచనాలు అందుకోలేదు కాదు కదా డిజాస్టర్ గా మారింది.

 * పాన్ ఇండియా నటుడిగా మారిన రానా హీరోగా ప్రభు సాల్మన్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా అరణ్య. ఎన్నో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా నిరాశనే మిగిల్చింది.
* విష్ణు హీరోగా కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం 'మోసగాళ్ళు'. ఈ చిత్రాన్ని హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ డైరెక్ట్ చేశారు. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ ఈ సినిమా వసూళ్లను రాబట్టలేకపోయింది.
 * నితిన్ రంగ్ దే , అక్కినేని నాగార్జున వైల్డ్ డాగ్ , వైష్ణవ్ తేజ్ నటించిన కొండపొలం , శర్వానంద్, సిద్దార్థ్  ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ మహాసముద్రం,  నాగ శౌర్య నటించిన లక్ష్య  చిత్రాలు కూడా భారీ అంచనాల నడుమ విడుదలై నిరాశను మిగిల్చాయి.
 పైన తెలిపిన హీరోలు మరియు డైరెక్టర్లకు ఈ సంవత్సరం కలిసి రాలేదు. మరి వచ్చే సంవత్సరం అయినా కలిసి వస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: