బాలీవుడ్ కండల వీరుడు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పాము కాటుకు గురవ్వడంతో హాస్పిటల్ లో చేరారని సమాచారం. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిమితంగానే ఉందని ప్రమాదం ఏమీ లేదని తెలుస్తోంది. అయితే ఈ విషయం విన్న ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఏదీ ఏమైనా ఈ చిన్న ప్రమాదం కూడా వారిని చాలా బాధిస్తోంది అని అంటున్నారు. తమ ప్రియతమ హీరో వీలైనంత త్వరగా తమకు నేరుగా సమాచారం అందిస్తే కానీ మనసు కుదుట పడదు అని, ఈ టెన్షన్ తగ్గదు అని చింతిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ విన్నపాలను తెలియచేస్తున్నారు.

తమ అభిమాన నటుడు సల్మాన్ ఖాన్ ఆరోగ్య పరిస్తితి పట్ల పూర్తి క్లారిటీ వస్తే కానీ వారికి మనశ్శాంతి ఉండదని బాధపడుతున్నారు. అసలు విషయం ఏమిటి..?? సల్మాన్ కు ఏ పాము కరిచింది అంటే..?? మహారాష్ట్ర లోని పన్వేల్‌ లోని ఫామ్‌ హౌస్‌లో సల్మాన్ ఖాన్ ఉండగా శని వారం అర్థ రాత్రి సమయంలో సల్మాన్‌ కు పాము కాటేసిందని  తెలుస్తోంది. హుటాహుటిన సల్మాన్ ఖాన్ ను నేరుగా నవీ ముంబై కమోతే ప్రాంతంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి సల్మాన్ ను అయన అనుచరులు తీసుకు వెళ్లారని. అయితే సల్మాన్ ను పరీక్షించిన వైద్యులు ఆ పాము వల్ల సల్మాన్ ఖాన్ కు ఎటువంటి ప్రమాదం జరగలేదని అది విషం లేని పాము అని చెప్పారట.

దీనిని బట్టి సల్మాన్ కు ప్రాణభయం ఏమీ లేదని తెలుస్తోంది. ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని సల్మాన్ తిరిగి గెస్ట్ హౌజ్ కి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా పూర్తి వివరాలు స్పష్టంగా తెలియని కారణంగా ఆయన అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఎక్కడ ఏ విధంగా పాము కాటుకు గురయ్యాడు అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి. మాములుగా గెస్ట్ హౌస్ లో గార్డెన్స్ ఉండడం మాములే. అక్కడ గార్డెన్ లో సేద తీరుతూ ఉండగా చలికాలం కాబట్టి పాములు బయట తిరుగుతూ సల్మాన్ ను కాటేసింది అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: