టాలీవుడ్ లో బ్యూటిఫుల్ కపుల్స్ గా అందరి దృష్టిని తమ వైపు తిప్పుకున్న జంట అక్కినేని నాగచైతన్య మరియు సమంతలది. వీరి అన్యోన్యతకు అందరూ కుళ్లుకున్న వారే అంటే నమ్మండి. అయితే వీరిద్దరూ ఎవరూ ఊహించని విధంగా ఎవరికి వారు అంటూ విడి పోయి అందరికీ షాక్ ఇచ్చారు. మనస్పర్ధలు రావడంతో ఎంతో హాయిగా సాగుతున్న వీరి కాపురంలో మంటలు రేగాయి. చివరికి విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ లో వారు బిజీగా మారిపోయారు. అయితే ఇపుడు తాజాగా మరో టాలీవుడ్ సెలబ్రిటీ జంట ఇదే తరహాలో విడాకులు తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు అంటూ వినిపిస్తోంది.

అయితే ఈ గొడవ ఇప్పటిది కాదట పెళ్లి అయిన రోజు నుండి పలుమార్లు వీరు విడపో బోతున్నారు అనే రూమర్లు వచ్చాయి. కానీ  ఇపుడు నిజంగానే విడిపోవడానికి సిద్ధ పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కోర్టులో కేసులు కూడా వేసినట్లు సమాచారం. అయితే ఇరు ఫ్యామిలీ రంగం లోకి దిగి వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారట. అయితే ఈ సెలబ్రిటీ జంట విడిపోవడానికి చాలా పెద్ద కారణమే వినిపిస్తోంది, బాలీవుడ్ నటిని ప్రేమించిన ఆ నటుడు ఇపుడు ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యం తోనే ఇలా విడిపోవడానికి సిద్ధ పడినట్లు తెలుస్తోంది.

అయితే తను అక్కర్లేనప్పుడు ఆ బంధానికి విలువ లేదని ఆ నటి కూడా విడాకులకు ఒప్పుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మరియు ఈ సెలబ్రిటీ జంట గురించి వీరి విడాకుల వ్యవహారం గురించి బయటకు చెప్పనున్నారు. అయితే ఇలా జరగడం కొత్త కాకపోయినా ఒక వివాహ బంధానికి విలువ లేకుండా ఇలా చేయడం వారికీ మంచిది కాదు అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. మరి మిగిలి ఉన్న ఈ కొద్ది సమయంలో వారి మనసు మారి మళ్ళీ ఒక్కటిగా జీవితాన్ని గడపాలని కోరుకుందాం...

మరింత సమాచారం తెలుసుకోండి: