ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హీరోగా మొదటి సినిమా హిట్ అందుకున్న నవీన్ పొలిశెట్టి జాతిరత్నాలు సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. జాతిరత్నాలు తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చిన నవీన్ లేటెస్ట్ గా తన బర్త్ డే రోజు రెండు క్రేజీ సినిమాలతో సర్ ప్రైజ్ చేశాడు. అందులో ఒకటి కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉన్న యువి క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా కాగా మరోటి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సినిమా అని తెలుస్తుంది.

యువి బ్యానర్ లో మహేష్ డైరక్షన్ లో నవీన్ పొలిశెట్టి సినిమా వస్తుంది. ఈ సినిమాలో అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించడం విశేషం. ఇక నవీన్ తన నాల్గవ సినిమాగా సితార బ్యానర్ లో చేస్తున్నాడు. ఈ సినిమాను కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇదివరకు ఆయన నేను మీ కళ్యాణ్ అనే వెబ్ సీరీస్ ను డైరెక్ట్ చేశారు. ఇక ఇప్పుడు నవీన్ పొలిశెట్టితో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మహ రాజా చెయిర్ లో పంచె కట్టు.. చేత్యి వేళ్లకు రింగులతో బిందాస్ గా కూర్చుని ఉన్నాడు నవీన్ పొలిశెట్టి. సినిమాలో అతను లైఫ్ ఎంజాయ్ చేసే వ్యక్తి పాత్ర చేస్తున్నాడని అనిపిస్తుంది. తప్పకుండా ఆడియెన్స్ ను మరోసారి తన కామెడీ, టైమింగ్ తో అలరించాలని ఫిక్స్ అయ్యాడు నవీన్ పొలిశెట్టి. మరి రెండు పెద్ద బ్యానర్ లతో ఈసారి డబుల్ ధమాకా ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు నవీన్ పొలిశెట్టి. కుర్రాడి స్పీడ్ చూస్తుంటే టాలీవుడ్ లో స్టార్ హీరోగా అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి. యువి క్రియేషన్స్ లో అలా.. సితార బ్యానర్ లో ఇలా రెండు ఫస్ట్ లుక్ లతో నవీన్ పొలిశెట్టి ఆడియెన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు. తప్పకుండా ఈ రెండు సినిమాలు అతని కెరియర్ కు ఎంతో హెల్ప్ అయ్యేలా ఉంటాయని ఫిక్స్ అవ్వొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: