దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్ లుగా అజయ్ దేవగన్, సముద్ర కని ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్,  ఈ సినిమాను భారీ బడ్జెట్ తో డి.వి.వి.దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి పాన్ ఇండియా రేంజ్ లో జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి, ఇలా జనాల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన విడుదల చేయబోతున్నారు, ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఈ చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్ లో స్పీడ్ పెంచేసింది.

ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే, ఇది ఇలా ఉంటే ఈ చిత్ర బృందం మాత్రం ప్రమోషన్ ల విషయంలో ఎక్కువగా బాలీవుడ్ మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టింది, అందులో భాగంగా మొదట ఈ సినిమా ట్రైలర్ ను ముంబై లో లాంచ్ చేశారు,  ఆ తర్వాత ముంబై లో భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ను  కూడా ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ముగించేసింది, అలాగే ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ హిందీ లో ఫేమస్ అయిన టీవీ షో లకు అటెండ్ అయ్యి ఈ సినిమాను బాలీవుడ్ లో ఫుల్ గా ప్రమోట్ చేస్తున్నారు, అందులో భాగంగా ఇప్పటికే కామెడీ నైట్స్ విత్ కపిల్ షో తో సినిమాను ఫుల్ గా ప్రమోట్ చేసిన ఈ చిత్ర బృందం, తాజాగా హిందీ బిగ్ బాస్ లో కూడా హల్ చల్ చేశారు,  సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో కు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం గెస్ట్ లుగా వెళ్లారు,  ఆ స్టేజీ పై ఈ చిత్ర బృందం ఫుల్ గా సందడి చేసింది, ఇలా బాలీవుడ్ లో ప్రమోషన్ విషయంలో ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ఏ మాత్రం తగ్గడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: