ఈ ఏడాది సినీ ప్రేక్షకులకు, నటీనటులకు అంతగా కలిసి రాలేదని చెప్పుకోవచ్చు. కరొనా కారణం చేత ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు, అంతేకాకుండా సినిమా టికెట్ల ధరలు కూడా అంతంత మాత్రమే ఉండడంతో.. సినీ నటులు అంతా సినిమాలను విడుదల చేయడానికి ఆలోచిస్తున్నారు. ఇక ఒక పక్క మరొక వైరస్ వేగంగా దూసుకుంటూ రావడంతో.. థియేటర్లు ఎప్పుడూ మూత పడతాయో తెలియకుండా ఉంటోంది. కానీ ఈ ఏడాది ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్నో సినిమాలను విడుదల చేయడం జరిగింది. అయితే ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినా సినిమాలు ఏంటో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా.. ఈ సంవత్సరం విడుదల చేసిన సినిమా అల్లుడు అదుర్స్.. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అంతేకాకుండా ఈ సినిమాకి నెటిజెన్స్ అల్లుడు బెదర్స్ అనే కామెంట్ రూపంలో తెలియజేశారు. ఇక మరొక యువ హీరో అల్లరి నరేష్ బంగారు బుల్లోడు అనే టైటిల్ తో థియేటర్లలో అడుగుపెట్టాడు. కానీ ఈ సినిమా కూడా బోల్తా కొట్టేసింది. ఇక ఎన్నో రోజులగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరో సుమంత్ కూడా కపటదారి సినిమాతో థియేటర్లలో అడుగు పెట్టగా.. అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఇక హీరో నితిన్ చెక్ సినిమాతో విడుదల కాగా ఏ మాత్రం మెప్పించలేకపోయాడు అభిమానులను. యువ హీరో శ్రీ విష్ణు గాలి సంపత్ సినిమాలు నటించగా ఈ సినిమాతో కూడా ప్రేక్షకులను మోప్పించక లేకపోయాడు, అంతే కాకుండా ఈ సినిమా స్టోరీ మిస్టరీగానే మిగిలిపోయింది అని సమాచారం. ఇక యువ హీరో కార్తికేయ చావు కబురు చల్లగా సినిమాతో బాగా హడావిడి చేసినప్పటికీ.. ఈ సినిమాను ప్రేక్షకులు స్వాగతించలేకపోయారు.ఇక హీరో రానా అరణ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆకట్టుకోలేకపోయాడు

ఇక మరొక హీరో మంచు విష్ణు కూడా మోసగాళ్ల సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. కాజల్ చెల్లి పాత్రలో నటించడంతో ఈ  సినిమా డిజాస్టర్ గా మిగిలింది.ఇక శర్వానంద్ శ్రీకారం, రంగ్ దే, తెల్లవారితే గురువారం, వైల్డ్ డాగ్, శశి. వంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఇవే కాకుండా మరికొన్ని సినిమాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: