సినీ ఇండస్ట్రీలో కోర్ట్ రూమ్ డ్రామా స్ కి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. ఆసక్తికరమైన కథా,కథనాలు చక్కటి ఎమోషన్స్ ఉంటే కచ్చితంగా ఆ సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణను కనబరుస్తారు. అయితే 2021 సంవత్సరం లో ఇదే తరహాలో పలు చిత్రాలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం...

వకీల్ సాబ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత నటించిన సినిమా ఇది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కింది వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ కి వచ్చి ఒక హాస్టల్లో ఉంటున్న ముగ్గురు అమ్మాయిలు ఓ గొడవలో ఇరుక్కుంటారు. ఆ గొడవ కాస్త కోర్ట్ కేస్ వరకు వెళుతుంది. ఆ పరిస్థితిలో ఆ అమ్మాయిల తరఫున న్యాయవాది సత్యదేవ్ పాత్రలో నిలబడి వారికి న్యాయం చేయడమే ఈ సినిమా కథాంశం. ముఖ్యంగా సినిమాలోని బలమైన కోర్ట్ సన్నివేశాలే ఈ సినిమాను నిలబెట్టాయి. ఫలితంగా ఏ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది..

జై భీమ్

కోలీవుడ్ అగ్ర హీరో సూర్య ప్రధానపాత్రలో లాయర్ గా నటించిన చిత్రం జై భీమ్. చంద్రు అనే ఒక న్యాయవాది జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఓటిటి లో అన్ని భాషల్లో విడుదలైంది. చేయని నేరానికి జైలుపాలైన ముగ్గురు గిరిజనులు అదృశ్యమవుతారు. అందులో ఒకరి భార్య న్యాయం చేయమని కోర్టు మెట్లు ఎక్కుతుంది. ఆమెకి చంద్రు అనే లాయర్ కేసు వాదించి ఆమెకి న్యాయం చేశాడు. ఇక సినిమాలో సహజమైన సన్నివేశాలు, ఎమోషన్ సీన్స్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో సినిమా సంచలన విజయం సాధించింది..

నాంది

అల్లరి నరేష్ హీరోగా నటించిన ఈ సినిమాని విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. ఒక హత్య కేసులో ప్రధాన నిందితుడిగా కోర్టు మెట్లు ఎక్కిన ఒక యువకుడి తరుపున నిలబడిన లాయర్ ఆ యువకుడు నిర్దోషి అని నిరూపించడమే ఈ సినిమా కథాంశం. ఈ పాత్ర కోసం అల్లరి నరేష్ నగ్నంగా కూడా నటించాడు. ఇక లాయర్ గా వరలక్ష్మి శరత్ కుమార్ మంచి నటనను ప్రదర్శించింది. ఇక ఈ సినిమా అల్లరి నరేష్ కి నటుడిగా పునర్జన్మ నిచ్చింది అని చెప్పాలి. సినిమాలో ఎమోషన్స్ కూడా పడడంతో మంచి విజయాన్ని అందుకుంది..

చెక్

లవర్ బాయ్ నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందింది. చేయని నేరానికి జైలుపాలైన ఒక యువకుడు చదరంగంలో గ్రాండ్ మాస్టర్ గా ఎదిగి తన నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకున్నాడు అనేదే ఈ సినిమా కథాంశం. ఇక సినిమాలో కోర్ట్ రూమ్ సన్నివేశాలు చెస్ గేమ్ కి సంబంధించిన కొన్ని సీన్స్ ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. ఈ సినిమాలో హీరో తరుపున వాదించే లాయర్ గా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించగా.. సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: