మెగా స్టార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ కీలక పాత్రలో కాజల్ హీరోయిన్ గా నటించిన చిత్రం ఆచార్య. రామ్ చరణ్ జోడీగా హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ ఈ సినిమాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తు ఉండగా ఫిబ్రవరి 4వ తేదీన దేశ వ్యాప్తంగా ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా విడుదల చేయనుంది ఈ చిత్ర బృందం. ఇప్పటికే ఈ సినిమా నుంచి చాలా అప్ డేట్ లు విడుదల అవగా ఈ సినిమా పై భారీ అంచనాలు పెంచాయి.

మెగా ఫ్యాన్స్ కి ఈ చిత్రం తప్పకుండా మెగాస్టార్ అభిమానులకు ఫుల్ మీల్స్ అందిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అని చిత్రబృందం చెబుతోంది. మణిశర్మ కంపోజ్ చేసిన పాటలకు మెగాస్టార్ మరియు మెగా పవర్ స్టార్ స్టెప్పులు అదిరిపోతాయి అని అంటున్నారు. ఇంట్రడక్షన్ సీన్ అదిరిపోయేలా ఉంటుందట.  సంక్రాంతి పండగ తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టాలని చిత్రబృందం భావిస్తుంది. అయితే ఇప్పుడు రాబోతున్న కొత్త సంవత్సరం సందర్భంగా ఒక అప్డేట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా సన్నాహాలు చేస్తుంది యూనిట్.

ఆచార్య నుంచి న్యూ ఇయర్ గిఫ్ట్ గా మెగా ఫ్యాన్స్ కు మంచి గిఫ్ట్ ఇవ్వాలని చిరంజీవి భావించారట. అందుకే ఏ అప్డేట్ ఇస్తే బాగుంటుంది అని ఆలోచించగా డిస్కస్ చేసి చివరికి ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కానీ ట్రైలర్ కానీ విడుదల చేయాలని వారు భావిస్తున్నారట. అలాగే వీరిద్దరి కాంబినేషన్ లో ఉన్న ఓ పాటను కూడా విడుదల చేసే ఆలోచనలో ఉందట యూనిట్. న్యూ ఇయర్ కి ఈ మెగా మూవీ నుంచి మెగా అప్డేట్ రావడం మెగా స్టార్ అభిమానులకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మరి ఈ అప్డేట్ సినిమాపై అంచనాలను కూడా భారీ గా పెంచుతుందా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: